BigTV English

Theater Movies : థియేటర్లలోకి రాబోతున్న కొత్త చిత్రాలు.. తెలుగులో కన్నప్పతో పాటు..

Theater Movies : థియేటర్లలోకి రాబోతున్న కొత్త చిత్రాలు.. తెలుగులో కన్నప్పతో పాటు..

Theater Movies : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ నెల చివరి వారంలో కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడంతో ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. భారీ అంచనాల మధ్య స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ చివరి వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


కన్నప్ప..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప.. ఈ మూవీ విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. గత కొద్దిరోజులుగా ఈ మూవీ రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడటమే.. ప్రభాస్, విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ ఉండటంతో మూవీపై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ప్రస్తుతం తెలుగు డబ్డ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ తో పాటు బాలీవుడ్ నుంచి హారర్ థ్రిల్లర్ రానుంది. ఇప్పుడు థియేటర్లో కుబేర ఒక్కడే కుమ్మేస్తున్నాడు. జూన్ 20న రిలీజైన కుబేర.. బాక్సాఫీస్ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. 27 వరకు ఈ మూవీ హవానే కొనసాగుతుంది..


మార్గన్..

తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ, నిర్మించిన మూవీ ‘మార్గన్’.లియో జాన్ పాల్ దర్శకుడు. తెలుగులో జె.రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్స్ భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌లో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్‌ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్ తదితరులు ప్రత్యేక పాత్రలో నటించారు..

Also Read:సుడిగాలి సుధీర్ తో అది చెయ్యాలి.. ఇదేం ఖర్మ రా బాబు..

మా..

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మా..విశాల్ ఫూరియా దర్శకత్వం వహించాడు. జియో స్టూడియోస్‌తో కలిసి అజయ్ దేవగణ్‌, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మించారు. ఇక దుష్ట శక్తుల బారిన పడిన తన బిడ్డను ఓ తల్లి ఎలా కాపాడుకుందనే స్టోరీ లైన్ పై మూవీ తెరకెక్కింది. రోనిత్ రాయ్, సుభద్ర సేన్ గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది.. సైతాన్ మూవీ బ్యాక్ గ్రౌండ్ లో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుంది. కొన్ని సీన్లు ఇంచుమించు ఈ సినిమాలోని సీన్లను పోలి ఉంటాయని గతంలో దర్శకుడు ఓ సందర్భంలో అన్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

Related News

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Sridevi Birth Anniversary: అతిలోక సుందరి శ్రీదేవి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

Big Stories

×