E-Paper
Advertisement

Congress Leader Missing: మున్సిపల్ ఎన్నికల వేళ షాక్.. వేములవాడ 4వ వార్డు కాంగ్రెస్ నేత మిస్సింగ్!

Congress Leader Missing: మున్సిపల్ ఎన్నికల వేళ షాక్.. వేములవాడ 4వ వార్డు కాంగ్రెస్ నేత మిస్సింగ్!
Advertisement

Congress Leader Missing: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఎన్నికల వేళ కలకలం రేగింది. వేములవాడ మున్సిపాలిటీ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు తోటరాజు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ సమీకరణాలు, టికెట్ కేటాయింపులో జరిగిన పరిణామాలే దీనికి కారణమని తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ 4వ వార్డు నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఆశావహులుగా ఉండి, నామినేషన్లు దాఖలు చేశారు. అయితే.. పార్టీ అధిష్టానం ఇద్దరినీ పిలిపించి చర్చలు జరిపింది. చివరి నిమిషంలో తోటరాజును పక్కన పెట్టి, టికెట్‌ను మరొక అభ్యర్థికి కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అవకాశం రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Advertisement

సోమవారం ఉదయం తోటరాజు ఇంట్లో టిఫిన్ తిని బయటకు వెళ్లారు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా.. మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పలుచోట్ల వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తోటరాజు అదృశ్యంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రాజకీయ కారణాలతోనే ఈ అదృశ్యం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి ఇలా అదృశ్యం కావడం పట్టణంలో రాజకీయ వేడిని పెంచింది.

Advertisement

Also Read: విచారణ చేయడంలో తప్పేం లేదు.. కేసీఆర్ పై కవిత సంచలనం

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×