Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. ప్రభాస్ చేతిలో దాదాపు 5 ప్రాజెక్టులు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజా సబ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ బర్తడే కు వస్తుంది అని గతంలో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వలన అది రాలేదు. నవంబర్ 5వ తారీఖున మొదటి సింగిల్ రానున్నట్లు తెలుస్తుంది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు కూడా సీరియస్ మోడ్ లో ఉంటాయి. అయితే బుజ్జిగాడు డార్లింగ్ వంటి సినిమాల్లో ప్రభాస్ క్యారెక్టర్ట్రైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాకి సంబంధించి అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడు మారుతి. చాలామంది అభిమానులకు రాజా సాబ్ సినిమా మీద మంచి క్యూరియాసిటీ ఉంది. బర్త్డే సందర్భంగా వచ్చిన పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ప్రభాస్ బర్త్డే సందర్భంగా వచ్చిన అప్డేట్స్ అన్నిటికంటే కూడా స్పిరిట్ సినిమా అప్డేట్ హైలైట్ గా మారింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఉన్న క్రేజ్ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు ఎంత పాపులారిటీ వచ్చిందో మరోవైపు సందీప్ రెడ్డి వంగాకి కూడా అంతేమంది ఫ్యాన్స్ గుర్తుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగ టేకింగ్ చూసి పిచ్చెక్కిపోయే జనాలు కూడా ఉన్నారు.
రన్బీర్ కపూర్ లాంటి హీరోతో యానిమల్ వంటి సినిమా చేసి దాదాపు 1000 కోట్లు రికార్డు కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అయితే ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పిరిట్ సినిమా అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు నుంచి అందరూ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ప్రభాస్ చేస్తున్న రెండు ప్రాజెక్టుల కంటే కూడా ఎక్కువ అంచనాలు స్పిరిట్ సినిమా పైన మొదలైపోయాయి.
ఈ రెండు సినిమాలు పెద్దగా బయటకు వినిపించట్లేదు అని స్పిరిట్ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం ఆపేద్దామని ఫిక్స్ అయ్యారట చిత్ర యూనిట్. ఒకరకంగా అలా ఆపేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ తో ఈ సినిమాలు చూశారంటే ఫలితం తేడా కొట్టే అవకాశం ఉంది.
స్పిరిట్ సినిమాకు సంబంధించి బ్యాగ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ 70% పూర్తయిపోయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ తో సినిమాని లేపడం సందీప్ రెడ్డి వంగ స్టైల్. ఇకపోతే స్పిరిట్ సినిమాకి సంబంధించి చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నాడు సందీప్.
ఈ సినిమా షూటింగ్ నవంబర్ 8వ తారీకు నుంచి మొదలుకాని ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది. స్పిరిట్ సినిమాకి చాలామంది సెలబ్రిటీలు కొడుకులు కూడా సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ కొడుకు రిషి, అలానే రవితేజ కొడుకు మహదన్ కూడా స్పిరిట్ సినిమాకి పనిచేస్తున్నారు.
Also Read: Bison: బైసన్ సినిమాపై ముఖ్యమంత్రి ప్రశంసలు, తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి