E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా?

Peddi Movie: పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా?
Advertisement

Peddi Movie: ఈమధ్య కాలంలో హీరోయిన్లు ఒకవైపు సినిమాలలో హీరోయిన్లుగా నటిస్తూనే.. మరొకవైపు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సీతామహాలక్ష్మిగా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడానికి సిద్ధమైందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో కలిసి చిందేయడానికి ఈ ముద్దుగుమ్మను ఫైనల్ చేశారనే వార్తలు రాగా.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేసేలా చేసింది మృణాల్ ఠాకూర్.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోసం ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే మృణాల్ ఠాకూర్ పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతోంది అంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ కి చేరుకుంది. ఇక ఆమె రాక ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె ఇందులో ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్త, ఈమె రాక అన్నీ అనుమానాలు పెంచుతున్నాయి. ఇక త్వరలోనే దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇకపోతే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ లేదా ట్రైలర్ అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్ది సినిమా విశేషాలు..

Advertisement

పెద్ది సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ , ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చికిరి చికిరి, రై రై రారా పాటలలోని రామ్ చరణ్ హుక్ స్టెప్స్ అభిమానులలో విపరీతమైన క్రేజ్ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో మరోసారి పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించగా.. ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఇషాన్ సక్సేన సహనిర్మాతగా , వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. శివరాజు కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

Advertisement

also read:Sri Satya: తల్లి ఫిజియోథెరపీ కోసం ప్రతినెలా అంత ఖర్చు చేస్తోందా.. శ్రీ సత్య కష్టం పగవాడికి కూడా వద్దు!

Related News

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

Big Stories

Advertisement
×