E-Paper
Advertisement

MSG Movie: 25 రోజులు.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రఫ్ఫాడించేశారుగా!

MSG Movie: 25 రోజులు.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రఫ్ఫాడించేశారుగా!
Advertisement

MSG Movie: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సక్సెస్‌ఫుల్‌గా 25 రోజులు పూర్తి చేసుకుని, ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మధ్య జనాలు థియేటర్లకు రావడం లేదని, సినిమా లైఫ్ కేవలం ఒకటి లేదా రెండు వారాలే అనేలా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం 25 డేస్ విజయవంతంగా పూర్తి చేసుకుని, ఇంకా భారీగానే కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయినా కూడా చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో టికెట్లు తెగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం, సక్సెస్‌ఫుల్‌గా 25 రోజులు పూర్తి చేసుకుందని తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Toxic Pre Release Business: తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే ఫ్యూసులు పోవాల్సిందే..!

25 రోజులకు వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Advertisement

ఈ పోస్టర్ ప్రకారం ఈ సినిమా ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్’ అని తెలుపుతూ రూ. 375 కోట్ల ప్లస్ గ్రాస్‌ను రాబట్టినట్లుగా పోస్టర్‌లో తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టిల్‌తో వచ్చిన ఈ పోస్టర్‌ని మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటికీ, ఈ వీకెండ్ కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఏ సినిమాకు కలెక్షన్స్ లేవు. కేవలం చిరంజీవి క్రేజ్ మాత్రమే ఇంకా పనిచేస్తుందనే దానికి ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్సే నిదర్శనం అని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక వైపు ఈ సినిమా సక్సెస్ అవ్వడం, మరోవైపు మెగా ట్విన్స్, ఇంకా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్, ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్.. ఇలా ఊపిరి తిప్పుకోలేనంతగా మెగా ఫ్యాన్స్‌కు మెగా హీరోలు ట్రీట్ ఇస్తున్నారు.

Also Read- Tollywood : వామ్మో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నటి.. బేబీ బంప్ ఫోటో వైరల్!

అంతా హ్యాపీ..

Advertisement

ఇక ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కేథరీన్ థ్రెసా మరో కీలక పాత్రలో కనిపించారు. శ్రీమతి అర్చన సమర్పించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలై.. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టి రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాలలోనూ లాభాలను రాబట్టి.. డిస్ట్రిబ్యూటర్స్‌కు, బయ్యర్స్‌కు సంతోషాన్నిచ్చింది. ఇదే ఊపులో చిరంజీవి తన తదుపరి సినిమాను సెట్స్‌పై తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. బాబీ దర్శకత్వంలో చిరు తదుపరి సినిమా ఉండబోతోంది.

Also Read- Sreeleela: బాలీవుడ్ గాలి వంటపట్టింది.. పబ్లిక్ అప్పీరెన్స్‌లో భారీ మార్పు!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×