E-Paper
Advertisement

Vibhishana – Subhadra: రామాయణంలోని విభీషణుడికి భారతంలోని సుభద్రకు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Vibhishana – Subhadra: రామాయణంలోని విభీషణుడికి భారతంలోని సుభద్రకు ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

Vibhishana – Subhadra: రామాయణంలో రావణాసురుడి తమ్ముడైన విభీషణుడికి మహాభారతంలో శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రతకు ఉన్న రిలేషన్‌ ఏంటో..? తెలుసా..? అసలు రామాయణానికి భారతానికి లింకేంటని ఆలోచిస్తున్నారు.. ఆ లింకేంటో  ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

రామాయణం త్రేతాయగానికి చెందినది. మహాభారతం ద్వాపర యుగానికి చెందినది కానీ ఈ రెండు యుగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులైన విభీషణుడు, సుభద్రకు  రిలేషన్‌ ఉందని మీకు తెలుసా..? ఆ రిలేషన్‌ ఎలా ఏర్పడిందన్నదే మనం ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆ రిలేషన్‌ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం త్రిజట గురించి తెలుసుకోవాలి.

త్రిజట ఎవరు..?

​త్రిజట ఒక రాక్షస కాంత. వాల్మీకి రామాయణం ప్రకారం, ఈమె రావణుడి తమ్ముడైన విభీషణుడి కుమార్తె. రాక్షస కులంలో పుట్టినప్పటికీ, ఈమె సాత్విక గుణము కలిగినది మరియు ధర్మం వైపు నిలబడే మనస్తత్వం కలది. రావణుడు సీతమ్మను అశోకవనంలో బంధించి, ఆమెను భయపెట్టమని రాక్షస స్త్రీలను కాపలా ఉంచినప్పుడు, ఆ సమూహంలో త్రిజట ఒకరు.

అశోకవనంలో సీతమ్మకు ఓదార్పు:

​రావణుడు సీతను బెదిరించి వెళ్ళిన తర్వాత, మిగిలిన రాక్షస స్త్రీలు సీతమ్మను చుట్టుముట్టి రకరకాలుగా భయపెడుతుంటారు. అప్పుడు సీతమ్మ ఎంతో విలపిస్తుంది. ఆ సమయంలో త్రిజట మిగిలిన రాక్షసులను గద్దించి, సీతమ్మకు ధైర్యం చెబుతుంది. సీతమ్మ సామాన్యురాలు కాదని సీతమ్మను హింసించ వద్దని  హెచ్చరించి, సీతమ్మకు ఒక తల్లిలా తోడుగా నిలుస్తుందట. సీతమ్మ అశోక వనంలో ఉన్నన్ని రోజులు పగలు రాత్రి తేడా లేకుండా సీతమ్మకు సపర్యలు చేసేదట.

రామ, రావణ యుద్దం తర్వాత:

రామరావణ యుద్దం తర్వాత రాముల వారు సీతమ్మను తీసుకుని అయోద్య బయలుదేరుతుంటే సీతమ్మ వారు త్రిజటను పిలిచి తన పట్ల ఎంతో కృతజ్ఞత చూపించావు. నీ సొంత సోదరిలా తల్లిలా గౌరవించావు. నా కష్ట సమయంలో నాకు తోడుగా నీడగా నిలిచావు. అంటూ త్రిజటను మెచ్చుకుని ఎన్నో కానులు ఇచ్చిందట. అలాగే “నీవు ఈ జన్మలో చేసిన సేవకు ప్రతిఫలంగా, నీవు ఎక్కడికి వెళ్లినా, ఏ జన్మ ఎత్తినా నీకు దైవ భక్తి మరియు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి” అంటూ దీవించిందట. అలాగే ఈ త్రేతాయుగంలో నేను నీకు రుణపడి ఉన్నాను. ఈ రుణం తీర్చుకోవడానికి, వచ్చే ద్వాపర యుగంలో నేను శ్రీ కృష్ణుడి భార్యగా ఉన్నప్పుడు, నీవు ఆ శ్రీకృష్ణుడికి తోబుట్టువుగా జన్మిస్తావు. అప్పుడు నీవు అందరిచే పూజించబడతావు. అంటూ వరం ఇచ్చిందట.

 శ్రీకృష్ణుడి సోదరి సుభద్రగా జన్మించడం:

​సీతమ్మ ఇచ్చిన వరం ప్రకారం, ద్వాపర యుగంలో వసుదేవుడు మరియు రోహిణి దేవిలకు పుత్రికగా త్రిజట జన్మించిందట. ఆమెకు సుభద్ర అని నామకరణం చేశారు. ​ఆమె శ్రీకృష్ణుడు మరియు బలరాములకు అత్యంత ప్రియమైన సోదరి. త్రేతాయుగంలో రాక్షస రూపంలో ఉన్న త్రిజట, ద్వాపరంలో అద్భుత సౌందర్యవతి అయిన సుభద్రగా అవతరించిందట.

ఇలా త్రేతాయుగంలో విభిషణుడి కూతురుగా పుట్టిన త్రిజట ద్వాపర యుగంలో సుభద్రగా జన్మించడంతో తేత్రాయుగంలో ఉన్న విభీషణుడికి ద్వాపర యుగంలో సుభద్రకు తండ్రి కూతుళ్ల బంధం ఉన్నట్టే కదా అంటూ చెప్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×