Mythri Movie Makers: ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా గురించి అందరికీ ఎంతో సుపరిచితమే. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పటికీ ఇళయరాజా సంగీతం అంటే చెవి కోసుకొనే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఇళయరాజా సినిమాలను కాస్త తగ్గించిన పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల యువ దర్శకులు వారి సినిమాలలో ఇళయరాజా పాటలను వాడుకుంటున్న నేపథ్యంలో ఈయన వారికి లీగల్ నోటీసులను పంపిస్తూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇళయరాజా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారి మధ్య కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్యూడ్ సినిమా విషయంలో ఇళయరాజా నోటీసులు అందించారు. అలాగే ప్రముఖ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమాని కూడా మైత్రి వారు నిర్మించారు. ఈ రెండు సినిమాలలో కూడా ఇళయరాజకు సంబంధించిన పాటలను ఎలాంటి అనుమతి లేకుండా వాడటం వల్ల ఇళయరాజా నోటీసులు పంపించారు. తను అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్న నేపథ్యంలో ఈయన మైత్రి వారికి నోటీసులు పంపిస్తూ తనకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని మరింత సాగదీయకుండా మైత్రి మూవీ మేకర్ ఇళయరాజా చెప్పిన విధంగానే అతనికి 50 లక్షల రూపాయలు చెల్లించడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇలా 50 లక్ష ఇవ్వటానికి మైత్రి నిర్మాతలు ఒప్పుకోవడంతో ఈ వివాదానికి పూర్తిగా పులి స్టాప్ పెట్టినట్టు అయింది. మైత్రి మూవీ మేకర్స్ వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
పాన్ ఇండియా ప్రాజెక్టులు..
ఇటీవల మైత్రి నిర్మాణంలో తెరకెక్కిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ,ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే . ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీ, డ్రాగన్ వంటి సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది .ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 3 సినిమాతో పాటు లోకేష్ కనగ రాజ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని కూడా మైత్రి వారే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: Akhanda 2: అఖండ 2 నుంచి ప్రగ్యా జైస్వాల్ ను అందుకే తప్పించారా?