Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ 2 (Akhanda 2)సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ ఇదివరకు కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ మొదటిసారి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా పట్ల అంచనాలు కూడా ఉన్నాయి. ఇక సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతలు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వీరికి ఊహించని ప్రశ్న ఎదురైనది.
అఖండ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నటి ప్రగ్యా జైస్వాల్(PragyaJaiswal) నటించిన విషయం తెలిసిందే. అయితే సీక్వెల్ సినిమాలో కూడా మొదట ప్రగ్యా జైస్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. కొంత భాగం ఈమెపై షూటింగ్ కూడా జరిగింది అయితే ఉన్నఫలంగా ఈమెను తప్పించి ఈ సినిమాలోకి నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) ను భాగం చేశారు. ఇలా ప్రగ్యా జైస్వాల్ అఖండ 2 నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే సందేహాలు చాలామంది వ్యక్తం చేశారు. కానీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాతలకు ఇదే ప్రశ్న ఎదురవడంతో నిర్మాతలలో ఒకరైన రామ్అచంట (Ram Achanta)సమాధానం చెప్పారు.
అఖండ మొదటి భాగంలో ప్రగ్యా జైస్వాల్ నటించడంతో మొదట సీక్వెల్ సినిమాకు కూడా ఆమెనే ఎంపిక చేసుకున్నాం కానీ హీరోయిన్ కథ ప్రాధాన్యతను బట్టి చూస్తే ఆ పాత్రకు ఆమె సెట్ అవ్వదని అనిపించింది అందుకే తనని తప్పించి సంయుక్త మీనన్ ను తీసుకున్నామని తెలిపారు. ఇక సినిమా చూసిన తర్వాత ఎందుకు ప్రగ్యా జైస్వాల్ ను తప్పించామనే విషయం పై అందరికీ క్లారిటీ వస్తుందని రామ్ అచంట తెలిపారు. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ పాత్ర మధ్యలోనే చనిపోతుందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి.
మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో..
ఇలా ఆమె పాత్ర చనిపోయినట్టు ఉన్న నేపథ్యంలోనే బహుశా ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నారా అనే సందేహాలను అందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ యధావిధిగా ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో బాలకృష్ణ ప్రతి ఒక్క సినిమాలో కూడా ద్విపాత్రాభినయంలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం సినిమా సరికొత్త రికార్డులను సృష్టించబోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Akhanda 2: అఖండ 2లో భక్త ప్రహ్లాదుడి పాత్ర.. ఈ స్టార్ కిడ్ తో