E-Paper
Advertisement

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Nabha Natesh:నభా నటేష్..తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించిన ఈ అమ్మడు తన అందంతో మరోసారి కుర్రకారును ఫిదా చేసిందనే చెప్పాలి.

ఈ ఫోటోలకు మెయిన్ హైలైట్‌

Advertisement

ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లుగా ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు ఈ ఫోటోలకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయనడంలో సందేహం లేదు.ఇక ఈ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘The stage is home’ అంటూ సింపుల్‌గా క్యాప్షన్ పెట్టేయడంతో ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్ .

‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో

Advertisement

ఇక నభా నటేష్ సినీ కెరీర్ విషయానికి వస్తే సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ సినిమాలో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తోనూ అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో నభా పండించిన కామెడీ, ఎనర్జీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పాలి.

ఆ తర్వాత ‘డిస్కో రాజా’ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.అయినప్పటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ సాయిధరమ్ తేజ్ పక్కన కనిపించి మరోసారి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ .

స్వయంభూ సినిమాతో మరోసారి

ఇక ‘అల్లుడు అదుర్స్’ సినిమాలోనూ అందాలని ఒలకబోసిన ఈ అమ్మడు ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన ‘మాస్ట్రో’ సినిమాలో కూడా మంచి రోల్ దక్కించుకుని తనని తాను ప్రూవ్ చేసుకుంది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలకి కూడా తానెప్పుడు సిద్దం అని అనేక సార్లు చెప్పుకొచ్చింది కూడా.ఆ క్రమంలోనే ఈ మధ్య నాగ బంధం అనే సినిమాతో  ఆడియన్స్ ని మెప్పించిన  ఈ భామ ఇపుడు నిఖిల్ స్వయంభూ సినిమాతో మరోసారి పలరించనుంది .

ఆ జోరుని ఎప్పుడు పెంచుతుందో !

అయితే గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన నభా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుందని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న అప్ డేట్స్ ని బట్టి అర్థమవుతుంది. చూడాలి మరి జోరు తగ్గించిన ఈ అందాల భామ ఆ జోరుని ఎప్పుడు పెంచుతుందో !

Tags

Related News

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!

ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

Big Stories

Advertisement
×