MS Narayana:ఈ ఏడాది చిత్ర సీమలో వరుస శుభకార్యాలు అందర్నీ సంతోషంలో ముంచెత్తాయి. పెళ్లి వాతావరణంతో సెలబ్రిటీలు కళకళలాడుతున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరొకవైపు మరికొంతమంది సెలబ్రిటీల వారసులు వివాహం చేసుకొని అభిమానులకి సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇంకొంతమంది నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, తరాలు మారినా తన కామెడీతో ప్రేక్షకులను తెరపై నవ్విస్తూ మెప్పించిన దివంగత కమెడియన్ ఎమ్. ఎస్ .నారాయణ మనవరాలు పెళ్లి ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
దివంగత హాస్యనటుడు ఎం.ఎస్.నారాయణ మనవరాలి వివాహ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది.ఈ శుభకార్యానికి సినీ ఇండస్ట్రీ నుండి సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు . ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఎంఎస్ నారాయణ మనవరాలి పెళ్లి వేడుకలో సందడి చేసిన సెలబ్రిటీల విషయానికొస్తే.. ప్రముఖ సీనియర్ నటుడు రావు రమేష్, ప్రముఖ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత వంశీ నందిపాటి తదితరులు ఈ వేడుకలో కనిపించారు. ఇకపోతే ఈ వివాహ వేడుకకు ముందు ఎంగేజ్మెంట్ వేడుక కూడా చాలా ఘనంగా జరిగింది. ఏది ఏమైనా ఎమ్.ఎస్. నారాయణ మనవరాలి పెళ్లి ఘనంగా జరగడంతో ఆయన ఈ సమయంలో ఉండుంటే బాగుండు అంటూ ఎంఎస్ నారాయణ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. నూతన దంపతులకు సినీ ప్రముఖులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దివంగత ప్రముఖ తెలుగు హాస్య నటుడు ఎమ్. ఎస్ .నారాయణకు కొడుకు ,కూతురు ఉన్నారు. కొడుకు పేరు విక్రమ్ కాగా, కూతురు పేరు శశికిరణ్ నారాయణ. వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో పనిచేశారు. ఎమ్మెస్ నారాయణ తన కొడుకును హీరోగా చేయాలని ఎన్నో కలలు కన్నారు. అందులో భాగంగానే స్వీయ దర్శకత్వంలో 2004లో కొడుకు అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత దేనికైనా రెడీ వంటి చిత్రాలలో విక్రమ్ కీలక పాత్రలు పోషించారు.. కుమార్తె శశికిరణ్ విషయానికొస్తే ఈమె దర్శకురాలిగా పనిచేస్తున్నారు. సాహేబా సుబ్రహ్మణ్యం సినిమాతో పాటు హరికథ అనే వెబ్ సిరీస్ కి కూడా దర్శకత్వం వహించారు.
Actor Rao Ramesh at Comedian MS Narayana Grand Daughter Wedding Celebrations. #Raoramesh #Msnarayana #tollywood pic.twitter.com/RjnWLuh9kt
— Indian Clicks (@IndianClicks) November 26, 2026