E-Paper
Advertisement

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
Advertisement

 Irumudi Special:‘ఇరుముడి’…ప్లాపులతో కొట్టుకుపోతున్న రవితేజని ఒడ్డుకి లాక్కొచ్చిన సినిమా ఇది.అవును ..మాస్ మహారాజ్ కెరీర్ లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 260 కోట్ల వసూల్లని కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఊపులోనే ఇపుడు రవితేజ వరుస సినిమాలని లైన్లో పెట్టేస్తున్నాడు.అయితే ఈ నవంబర్ 28 నాటికి ఇరుముడి సినిమా 100 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా స్పెషల్ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఉన్న మైత్రీ విమల్ 70 ఎంఎం, దిల్‌సుఖ్‌నగర్‌లోని మైత్రీ గంగా థియేటర్లలో ఈస్పెషల్ షోస్ ఉండనున్నాయని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మైత్రి మేకర్స్. అది కూడా ఈ రెండు థియేటర్లలోనూ 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో ఆడియన్స్ కి ఒక మంచి ఫీల్ ని అందించేలా ప్లాన్ చేయడం విశేషం.ఇక ఈ స్పెషల్ షోస్ లలో మరో ముఖ్య్మమైన విషయం ఏంటంటే ఈ సినిమాలోని పాటలని రెండుసార్లు రిపీట్ చేయనున్నారట.

Advertisement

మాములుగానే సినిమా రీ రిలీజ్‌లు,స్పెషల్ షోస్ అంటేనే అభిమానులకు ఒక పెద్ద ఫెస్టివల్ అన్నట్టుగా మారిపోతుంది. అలాంటిది తమ అభిమాన హీరో కి సెన్సేషన్ హిట్ అందించిన సినిమాని అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్‌తో, థియేటర్ లో మరోసారి చూసే అవకాశం రావడంతో మాస్ మహారాజ అభిమానుల్లో జోష్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి.

ఇక దర్శకుడు విషయానికి వస్తే శివ నిర్వాణ గతంలో ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ వంటి సినిమలాతో ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకున్నాడో తెల్సిందే.ముఖ్యంగా ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని తెరమీద చూపించడంలో శివ నిర్వాణ సిద్ద హస్తుడనే చెప్పాలి. ఇక ఆ కోవలోనే ఇరుముడి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి స్ప్రుష్టించింది.

Advertisement

కథ విషయానికి వస్తే .. త్రినాథ్. తన భార్య, కూతురితో హ్యాపీగా కాలాన్ని గడిపేస్తుంటాడు. ముఖ్యంగా త్రినాథ్ కి కూతురు అంటే ప్రాణం. అయితే త్రినాథ్ కి తాగే అలవాటు ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న 41 రోజులు మాత్రమే తాగడు. కూతురు కోసం ఆ అలవాటు పూర్తిగా మానేయాలనుకుంటాడు.

ఇంతలో ఊరిలో స్కూలు అమ్మాయిలు అనుమానంగా చనిపోతుంటారు. దీని వెనుక ఏదో పెద్ద మిస్టరీ ఉందని త్రినాథ్ కి డౌట్ వస్తుంది. గురుస్వామి ఫ్యామిలీతోనూ కొన్ని గొడవలు మొదలవుతాయి.ఇలాంటి టైమ్ లో త్రినాథ్ కూతురికే ఒక పెద్ద సమస్య వస్తుంది. దాంతో త్రినాథ్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఆ అమ్మాయిల చావుల వెనుక ఎవరున్నారు? తన కూతురిని, మిగతా ఆడపిల్లలను కాపాడుకోవడానికి త్రినాథ్ ఏం చేశాడన్నదే ఈ కథ.

ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఇరుముడి సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.ఇక ఈ సందర్భంగా స్క్రీనింగ్ జరగనున్న ఈ స్పెషల్ షోస్ కోసం టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు మేకర్స్. చూడాలి మరి నవంబర్ 28న రాత్రి 10:23 గంటలకు పడనున్న ఈ స్పెషల్ షోలు రవితేజ అభిమానులకు ఎలాంటి జోష్ ని నింపుతాయో !

ALSO READ:వైష్ణవి సోనీ క్రేజ్ మామూలుగా లేదుగా.. వరుసగా హిట్ల మీద హిట్లు!

Tags

Related News

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!

ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

Big Stories

Advertisement
×