E-Paper
Advertisement

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!

నవ్విస్తూనే ట్విస్ట్ ఇచ్చిన ‘అలియాస్ రుక్మిణి’..ట్రైలర్ చూస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉందే!
Advertisement

Alias Rukmini Trailer:వరుస ప్లాపులతో సావాసం చేస్తున్న నితిన్ తాజాగా ఆలియాస్ రుక్మిణి అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమవుతున్నాడు.న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ చేస్తుండగా, నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా వదిలారు మేకర్స్.ఇక డిసెంబర్ 4న థియేటర్లలోకి రావడానికి రెడీ అయిన సినిమా ఇప్పటి నుండే మంచి బజ్ క్రియేట్ చేసుకోవడం విశేషం.

ఇక ట్రైలర్ చూస్తే మొదటి నుండే కథలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందనేలా డిజైన్ చేశాడు డైరెక్టర్ మురలికాంత్. ‘ది మ్యాంగో కింగ్’ అనే ఒక నాటకంతో మొదలవడం,ఫ్యామిలీ కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసే ఒక మాములు వ్యక్తి కలలు, అతడి బిహేవియర్ చుట్టూ సీన్స్ నడవడం వంటివి ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయనే చెప్పాలి.బయటకు చాలా సింపుల్‌గా కనిపించే ఒక మనిషి లైఫ్‌లో తెలియని మరో కోణం ఉందనే విషయాన్ని డైరెక్టర్ చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

Advertisement

ముఖ్యంగా ఇందులో హీరో కృష్ణ క్యారెక్టర్ చుట్టూ తిరిగే సీన్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచేలా ఉన్నాయి. అతడికి సంబంధించిన సీక్రెట్స్, తను రాసే పుస్తకాలు, తన కలలు, పర్సనల్ లైఫ్‌లో ఎదురయ్యే సిట్యుయేషన్స్ కథలో చాలా కీలకంగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది.ఇందులో వచ్చే పెళ్లి చూపుల సీన్స్ అయితే చాలా సహజంగా, సరదాగా ఉన్నాయని చెప్పాలి.

అయితే ఈ సినిమా కేవలం కామెడీ, లవ్ స్టోరీతోనే సాగిపోయే రొటీన్ మూవీ కాదని ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ చూస్తుంటే తెలుస్తోంది. అసలు కృష్ణ నిజ స్వరూపం ఏంటి? అతడి జీవితంలో ఈ రుక్మిణి ఎవరు? అసలు ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే ప్రశ్నలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయనడంలో సందేహం లేదు.ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చూస్తుంటే, కథలో ఏదో ఒక ఊహించని ట్విస్ట్ డైరెక్టర్ పేల్చబోతున్నట్టే కనిపిస్తుంది.

Advertisement

ఇక నాని ఈ సినిమాని ప్రెసెంట్ చేయడం, నాని అక్క దీప్తి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తుంది.మొన్న కోర్ట్ తోనే ఎలాంటి సినిమాలకి సపోర్ట్ చేస్తానో హింట్ ఇచ్చేశాడు నాని.ఇక నితిన్, ఆఫియా సయ్యద్ లీడ్ రోల్స్‌లో యూనానిమస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఒక ఫ్రెష్ గా ఉండబోతుందనేది ఖాయంగా కనిపిస్తుంది.

ALSO READ:ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!

మొత్తానికి ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్‌లో కామెడీ, లవ్, ఎమోషన్‌తో పాటు సస్పెన్స్‌ను కూడా ఉండబోతున్న క్లారిటీ అయితే వచ్చేసింది.చూడాలి మరి ట్రైలర్‌తోనే ఇంత క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా, థియేటర్లలో ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News

ఇస్మార్ట్ బ్యూటీ మళ్లీ వచ్చేసింది.. నభా నటేష్ లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!

ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

Big Stories

Advertisement
×