E-Paper
Advertisement

ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!

ఎవరూ ఊహించని కలెక్షన్స్.. ఈఎన్ఈ రిపీట్ దూకుడు మామూలుగా లేదుగా!
Advertisement

ENE Repeat:‘ఈ నగరానికి ఏమైంది’..తెలుగు ఆడియన్స్ ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది 2’ ENE రిపీట్ఇప్పుడు ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా యూత్‌నే టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుంది.అవును ..సినిమా రిలీజైన మొదటి ఏడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.51.8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టేసింది మరి.ఇక ఇదే విషయాన్ని అఫీషియల్ పోస్టర్ వదిలింది అనౌన్స్ చేసింది మూవీ టీమ్.

Advertisement

ఇక సినిమాకి వారంలోనే ఇలా సాలిడ్ వసూళ్లు రావడంతో మేకర్స్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోందనే చెప్పాలి. పైగా సినిమా చూసిన జనాలు మళ్లీ మళ్లీ థియేటర్లకు వస్తుండటంతో ‘బ్లాక్‌బస్టర్ రిపీట్’ అంటూ కొత్త పోస్టర్ కూడా వదిలడం విశేషం.2018లో వచ్చిన ఫస్ట్ పార్ట్ థియేటర్లలో కమర్షియల్ హిట్ కాకపోయినా, తర్వాత యూత్‌లో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం.

ఇందులోని నలుగురు ఫ్రెండ్స్ మధ్య సాగే సరదా గొడవలు, కామెడీ, ఎమోషన్స్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక క్రమ క్రమంగా రోజులు గడిచేకొద్దీ ఒక కల్ట్ క్లాసిక్‌ అయిపొయింది.. ఇప్పుడు అదే ఫీల్‌ను సీక్వెల్ రూపంలో మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్‌లో చేయగా శివాత్మిక రాజశేఖర్, అనీషా అంబ్రోస్ కూడా కీ రోల్స్ పోషించారు.

Advertisement

పాత సినిమాలో బాగా నవ్వించిన ఫ్రెండ్స్ గ్యాంగ్ మళ్లీ కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో మంచి ఎగ్జైట్‌మెంట్ ఉందని వస్తున్న వసూల్లే ప్రూవ్ చేస్తున్నాయి.ఇక ఈ నలుగురి మధ్య ఉండే కామెడీ టైమింగ్, ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు, సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయనడంలో సందేహం లేదు.

ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే తను చేసే సినిమాల్లో న్యాచురల్ డైలాగ్స్, యూత్ లైఫ్‌స్టైల్, క్యారెక్టర్ల బిహేవియర్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి.గతంలో ‘పెళ్లిచూపులు’తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన, ‘ఈ నగరానికి ఏమైంది’తో యూత్‌కు మరింత దగ్గరయ్యాడయ్యాడనే చెప్పాలి.ఆ తర్వాత యాక్టర్‌గా కూడా ‘కీడా కోలా’,ఓం శాంతి శాంతి,క్రేజీ కల్యాణం సినిమలతో మంచిపేరే తెచ్చుకున్నాడు.

ఇప్పుడు దర్శకుడిగా ENE రిపీట్ తో తనకు బాగా సూట్ అయిన ఫ్రెండ్‌షిప్ కామెడీ జానర్ లోనే సినిమా తీసి కేవలం వారం రోజుల్లోనే .51.8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టడం తో తరుణ్ పేరు ఇపుడు మారు మ్రోగిపోతుంది.చూడాలి మరి ఇక నుండి నా సత్తా చూపిస్తా అంటున్న తరుణ్ ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు స్ప్రుష్టిస్తాడో!

ALSO READ:‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

Tags

Related News

‘ఇరుముడి’ 100 డేస్ సెలబ్రేషన్స్..ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

నాగార్జున వందల కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సమంత.. బయటపెట్టిన రాజ్ పిన్నమ్మ!

ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

Big Stories

Advertisement
×