Industrial Parks: తెలంగాణలో ఇండస్ట్రియల్ పార్కులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీల అధికారాలు TGIICకి బదిలీ చేసింది. ఇండస్ట్రియల్ పార్కుల నిర్వహణ, అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలకు ఉన్న కొన్ని అధికారాలు, విధులను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభు్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఎక్కడైన కొత్తగా ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ పరిధిలో (పరిశ్రమలు లేని ప్రాంతాల్లో) వచ్చే ఆదాయంలో 65 శాతం TGIICకి, 35 శాతం సంబంధిత గ్రామ పంచాయతీకి కేటాయింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల్లో వచ్చే ఆదాయాన్ని 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించింది.
Also read: బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు సమన్లు.. మరోసారీ హాజరుకావాలని ఆదేశం!