E-Paper
Advertisement

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!
Advertisement

Actor Sivaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాజీ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శివాజీ (Sivaji) తాజాగా ఆలీతో అల్లరి(Alitho allari) అనే షోలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల విషయాలను బిగ్ బాస్ విషయాల గురించి అలాగే రాజకీయాల గురించి కూడా ఈ సందర్భంగా శివాజీ ప్రస్తావించారు.

టీటీడీ చైర్మన్ కావాలనే కోరిక..

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో తనకు ఒక కీలకమైన పదవి గురించి ఎప్పటినుంచో కోరిక ఉందని, ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో అంటూ తన చిన్ననాటి కోరికను ఈ సందర్భంగా శివాజీ బయటపెట్టారు. మరి శివాజీ చిన్నప్పటినుంచి కలలు కంటున్న ఆ కోరిక ఏంటి అనే విషయానికి వస్తే.. తాను చిన్నప్పుడు తిరుమలకు వెళ్లడంతో అక్కడ తనకు ఒక అవమానం జరిగిందని ఆ క్షణమే తాను టీటీడీ పాలకమండలి చైర్మన్ (TTD Chairman)అవ్వాలని నిశ్చయించుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అవ్వాలని తాను చాలా బలంగా కోరుకున్నాను కానీ ఇప్పటివరకు ఆ కోరిక నెరవేరలేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లో యాక్టింగ్ స్కూల్..

Advertisement

ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ కావడం అంటే కష్టమేనని, టీటీడీ చైర్మన్ కావాలంటే హోదా కావాలని తెలిపారు. మరి నాకు ఆ హోదా ఉందో లేదో తెలియదు. తాను కోరుకున్న ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఎదురు చూడాలి అంటూ ఈయన టీటీడీ చైర్మన్ పదవి పట్ల తనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తన మనసులో మాటను ఈ సందర్భంగా బయటపెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యాక్టింగ్ స్కూల్ నిర్మించాలన్నదే తన కళ అని కూడా ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.

బిగ్ బాస్ బజ్ హోస్ట్..

ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి గురించి శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను ఏ పార్టీకి అతీతం కాదని ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. ఇక ప్రస్తుతం శివాజీ విషయానికి వస్తే ఈయన ఒకవైపు సినిమాలలో నెగిటివ్ పాత్రలలోనూ తండ్రి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమ బజ్ హోస్ట్ (Bigg Boss 10 Buzz Host)గా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా సినిమాలతో ఎంతో బిజీగా ఉంటున్నా ఈయన రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

Advertisement

Also Read: విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

Related News

ఘనంగా స్టార్ కమెడియన్ M.S.నారాయణ మనవరాలి పెళ్లి..వీడియో వైరల్!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

Big Stories

Advertisement
×