E-Paper
Advertisement

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!

అందుకే ‘భోగి’ ప్రమోషన్స్ కి దూరం.. అనుపమ క్లారిటీ!
Advertisement

Anupama parameswaran:ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది అంటే.. ఆ విడుదల తేదీకి ముందుగానే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి, సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో హీరోయిన్ లేదా మెయిన్ లీడ్ పాత్రలు కనిపించకపోతే మాత్రం లేనిపోని అనుమానాలు, రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘భోగి’. శర్వానంద్ (Sharwanand) హీరోగా , అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) , డింపుల్ హయతి (Dimple hayathi) హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టింది.

భోగి ప్రమోషన్స్ కి దూరం కావడంపై అనుపమ క్లారిటీ..

అయితే ఆ కార్యక్రమాలలో అనుపమ ఎక్కడా కనిపించలేదు. దీంతో డింపుల్ హయతిని హైలెట్ చేస్తూ వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే అటు శర్వానంద్ తో డింపుల్ హయతి క్లోజ్ గా ఉన్న వీడియోలు కూడా సంచలనం సృష్టించాయి. ఇది చూసిన నెటిజన్స్ అంతా అనుపమను కావాలనే పక్కన పెట్టారా? ఆమె హర్ట్ అయ్యిందా? అందుకే ఆమె ప్రమోషన్స్ కి రాలేదా ? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేశారు. ఇక ఎట్టకేలకు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు మురిసిపోయిన అనుపమ స్పందించింది. తాను భోగి ప్రమోషనల్ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నానో చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టింది.

డేట్స్ సర్దుబాటు చేయలేకపోయాను – అనుపమ

Advertisement

ఈ మేరకు తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక లాంగ్ నోట్ విడుదల చేసింది అనుపమ.. “సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల కోసం.. షూటింగ్ తేదీలలో వచ్చిన మార్పులకు అనుగుణంగానే సర్దుబాటు చేసేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ చివరికి నేను గతంలో ఖరారు చేసుకున్న ఇతర సినిమా షూటింగ్ పనుల కారణంగా ఈ ప్రమోషన్స్ కి రాలేకపోయాను. ప్రస్తుతం నేను సైన్ చేసిన ఒక సినిమా షూటింగు ఊటీలో జరుగుతోంది. అందులో పాల్గొనాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని నేను మేకర్స్ కి వివరించగా భోగి చిత్ర బృందం అర్థం చేసుకొని నాకు సహకరించింది. ఇందుకు నేను చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

 

నా మనసంతా భోగి చుట్టూనే..

Advertisement

ప్రస్తుతం నేను సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయినా నా మనసంతా భోగి మూవీ చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులందరూ సినిమాను థియేటర్లలో చూసే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. మొత్తానికైతే అనుపమ ఈవెంట్లకు రాకపోవడంపై జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు.

also read:అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

అంచనాలు పెంచిన ప్రమోషనల్ కంటెంట్..

ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా శర్వానంద్ నటిస్తుండగా ..రంగస్థలం సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రను మిస్ చేసుకున్న అనుపమ ఈ సినిమాతో పక్కా పల్లెటూరి అమ్మాయిగా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలరు ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి. దీనికి తోడు రక్తంతో స్క్రీన్ ను సంపత్ నంది తడిపేసారు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అటు సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందులో శర్వానంద్ జీవించేశారు అనే కామెంట్లు కూడా చేసినట్లు సమాచారం. ఇన్ని అంచనాల మధ్య రేపు నవంబర్ 27న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

చిన్నప్పటినుంచి ఆ కోరిక బలంగా ఉంది.. చిరకాల కోరిక బయటపెట్టిన శివాజీ!

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

Big Stories

Advertisement
×