E-Paper
Advertisement

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా
Advertisement

Trolling On Mumbai Indians Over Umpire Nitin Menon over IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్ కెప్టెన్ ఎవరు అవుతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. హార్ధిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ లోకి ట్రేడ్ ద్వారా పంజాబ్ కింగ్స్ వెళ్లాడు. దీంతో కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలోనే కొత్త కెప్టెన్ ఇతనే అంటూ.. చేతిలో ముంబై ఇండియన్స్ క్యాప్ పట్టుకుని ఉన్న ఓ వ్యక్తి చేయి ఫోటోను యాజమాన్యం పంచుకుంది. దీంతో ఆ ఫోటో రోహిత్ శర్మదే అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హార్ధిక్ పాండ్యా వెళ్లిపోవడంతో రోహిత్ శర్మకే మళ్లీ కెప్టెన్సీ ఇచ్చేందుకు అంబానీ ముందుకు వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు.

ముంబై కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

అయితే, ఈ ఫోటోపై కొందరు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉంది రోహిత్ శర్మ కాదని.. అంపైర్ నితిన్ మీనన్‌ది అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. నితినే ముంబై ఇండియన్స్ జట్టుకు ఇంపాక్ట్ ప్లేయరని, అతన్నే కెప్టెన్ గా చేస్తే, టైటిల్ కొట్టడం గ్యారెంటీ అంటూ ఆడుకుంటున్నారు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు అనుకూలంగా అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయాలు తీసుకున్న తరుణంలో సెటైరికల్ ట్వీట్లు చేస్తూ ఎంఐని ఆడుకుంటున్నారు. వచ్చే సీజన్ కోసం నితీన్ మీనన్ అంపైరింగ్ తో పాటు కెప్టెన్సీ చేస్తే టైటిల్ ముంబై ఇండియన్స్ కు వస్తుందని చురకలు అంటిస్తున్నారు. అయితే, ఈ పోస్టులపై ముంబై ఇండియన్స్ అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఏ రోజున దొంగాట ఆడలేదని, నిజాయితీగా 5 ట్రోఫీలు గెలిచిందని పేర్కొంటున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఎవరికి దక్కుతుంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్ కెప్టెన్సీ ఎవరికీ దక్కుతుందనే విషయంపై ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొంత మంది రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతుంటే, సూర్య కుమార్ యాదవ్ కు ఇస్తే బెటర్ అంటూ మరికొందరు స్పష్టం చేస్తున్నారు. బుమ్రా, తిలక్ వర్మ పేర్లను కూడా యాజమాన్యం పరిశీలిస్తోందని తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన కనబరిచింది. అందుకే అతన్ని వదిలించుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. బలంగా జట్టును తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇలాంటి క్రమంలోనే రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే బెటరని డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై డిసెంబర్ 16వ తేదీ లోపు అధికారిక ప్రకటన చేసే ఛాన్సులు ఉన్నాయని సమాచారం. అందుకే ఓ ఫోటోె ద్వారా హింట్ ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ దాన్ని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

 

Related News

పాకిస్తాన్ మీడియాను బాయ్ కాట్ చేసిన‌ బాబ‌ర్ ఆజం.. దేశ‌ద్రోహి అంటూ రివ‌ర్స్ ఎటాక్

వైభ‌వ్ నాకు కొడుకు లాంటోడు…200 బాదాక‌ యువ‌రాజ్ పేరు చెప్పి కొంప‌ముంచాడు

వైభ‌వ్ మ‌నిషి కాదు, వాడు సిక్స‌ర్ల‌ రాక్ష‌సుడు.. వ‌న్డేల్లో 300 క‌చ్చితంగా కొడ‌తాడు

అంబానీ బిజినెస్ మైండ్..జైస్వాల్, ఆర్చ‌ర్ కోసం హార్దిక్ పాండ్యా ఎర‌గా వాడేశారుగా!

వైభ‌వ్ వ‌య‌స్సుపై త‌ప్పుడు కూత‌లు కూస్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. క‌మ్రాన్ అక్మ‌ల్ వార్నింగ్

అల్లా మీద ఒట్టు.. సెమీస్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

రాసి పెట్టుకోండి.. డేవిడ్ వార్న‌ర్, బెన్ స్టోక్స్ అన్ సోల్డ్ గా మిగులుతారు

Big Stories

Advertisement
×