E-Paper
Advertisement

Jemimah Rodrigues: మీరు ఎంత ట్రోలింగ్ చేసినా, త‌ట్టుకునే శ‌క్తిని ఆ జీసస్ ప్ర‌సాదిస్తున్నాడు..!

Jemimah Rodrigues:  మీరు ఎంత ట్రోలింగ్ చేసినా, త‌ట్టుకునే శ‌క్తిని ఆ జీసస్ ప్ర‌సాదిస్తున్నాడు..!
Advertisement

Jemimah Rodrigues: టీమిండియా మహిళ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు రీల్స్ చేస్తూ పాపులర్ అయిన జెమిమా రోడ్రిగ్స్, వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దుమ్ము లేపారు. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై జెమిమా రోడ్రిగ్స్ సెంచ‌రీ సాధించి, టీమిండియాను గెలిపించారు. ఏకంగా 125 ప‌రుగులు సాధించి, జ‌ట్టును ఆదుకున్నారు. చివ‌రి వ‌ర‌కు వికెట్ ప‌డ‌కుండా ఆడిన జెమిమా రోడ్రిగ్స్, టీమిండియా ఫైన‌ల్స్ కు చేర్చారు. ఈ త‌రుణంలోనే, జెమిమా రోడ్రిగ్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. జీస‌స్ వ‌ల్లే, టీమిండియా గెలిచింద‌ని జెమిమా రోడ్రిగ్స్ పేర్కొన్నారు. దీంతో జెమిమా రోడ్రిగ్స్ ను ట్రోలింగ్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

జెమిమా రోడ్రిగ్స్ పై ట్రోలింగ్స్

Advertisement

టీమిండియా విజయంలో జీస‌స్ ఉన్నాడ‌ని జెమిమా రోడ్రిగ్స్ ఉన్నాడ‌ని మ్యాచ్ అనంత‌రం పేర్కొన్నారు. దీంతో హిందువులు అంద‌రూ ఏక‌మై, జెమిమా రోడ్రిగ్స్ ను టార్గెట్ చేశారు. జీస‌స్ ను నమ్మేవాళ్ల‌ను టీమిండియా నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఉంటే, హిందువుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. జీస‌స్ ను నమ్మేవాళ్లు టీమిండియాను నాశ‌నం చేస్తార‌ని ఆగ్ర‌హిస్తున్నారు.

ట్రోలింగ్స్ పై జెమిమా రోడ్రిగ్స్ రియాక్ట్

జీస‌స్ ట్రోలింగ్స్ పై తాజాగా జెమిమా రోడ్రిగ్స్ స్పందించారు. చాలా మంది న‌న్ను కావాల‌నే ట్రోలింగ్ చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. ఎవ‌రు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా త‌న‌కు ఫ‌ర‌క్ ప‌డ‌బోద‌ని మండిప‌డ్డారు. న‌న్ను టార్గెట్ చేసి, ట్రోలింగ్స్ చేస్తున్నారు, న‌న్ను టార్చ‌ర్ పెడుతున్నారు… మీ అంద‌రి టార్చ‌ర్ త‌ట్టుకుంటున్నానంటే, దానికి కార‌ణం జీస‌సే అంటూ వ్యాఖ్యానించారు. మీరు అవ‌మానిస్తుంటే, దాన్ని త‌ట్టుకునే శ‌క్తిని జీస‌స్ ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. న‌న్ను ఎంత తొక్కితే, అంత పైకి లేస్తాన‌ని వెల్ల‌డించారు.

Advertisement

ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా మహిళ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్ల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా జెమిమా స్పందించారు. త‌న కుటుంబం మ‌త మార్పిడుల‌కు పాల్పుడుతున్న వార్త‌ల‌లో నిజం లేద‌న్నారు. త‌మ కుటుంబం జీస‌స్ ను న‌మ్ముకున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతేకానీ, ఎలాంటి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌ల‌కు త‌న కుటుంబం పూనుకోవ‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. కానీ కొంత మంది కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హించారు. కాగా మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025  లో ( Women’s ODI World Cup 2025 ) టీమిండియా ( Team India) విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాఫ్రికాపై 52 ప‌రుగుల తేడాతో ఇండియా విజ‌యం సాధించి, తొలిసారి ఛాంపియ‌న్ అయింది.

 

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×