E-Paper
Advertisement

Kalvakuntla Himanshu: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో BRSకు ఓటమి… సోషల్ మీడియాలో హిమాన్షు పోస్ట్ వైరల్

Kalvakuntla Himanshu: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో BRSకు ఓటమి… సోషల్ మీడియాలో హిమాన్షు పోస్ట్ వైరల్
Advertisement

Kalvakuntla Himanshu: తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) లో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మగంటి సునీత ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల ఫలితం కంటే, బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించిన 17 ఏళ్ల మగంటి వాత్సల్యనాథ్ ధైర్యం, ఆ పార్టీని చుట్టుముట్టిన కుటుంబ డ్రామానే ప్రధాన చర్చనీయాంశమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్, ఆయన రెండో భార్య సునీతల కుమారుడైన వాత్సల్య ( Maganti Vatsalya), తండ్రి మరణం తర్వాత తల్లి ప్రచార బాధ్యతలను ముందుండి నడిపించాడు.

తండ్రిని కోల్పోయిన విషాదం నుంచి తేరుకుని, వాత్సల్య ఇంటింటి ప్రచారం నుంచి రోడ్ షోల వరకు చురుగ్గా పాల్గొనడం బీఆర్ఎస్ శ్రేణులను ఆకట్టుకుంది. ఈ క్లిష్ట సమయంలో వాత్సల్యకు కేటీఆర్ కుమారుడు, కేసీఆర్ మనవడు హిమాన్షు రావు అండగా నిలిచాడు. తమ 13 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, “నీ ధైర్యం చూసి గర్విస్తున్నా.. ఒక సోదరుడిగా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను” అని హిమాన్షు ఫేస్‌బుక్‌లో పెట్టిన భావోద్వేగ పోస్ట్, ఇరు కుటుంబాల మధ్య బంధాన్ని చూపించింది.

Advertisement

ప్రచారం ఉత్సాహంగా సాగుతున్న తరుణంలో, కుటుంబ వివాదాలు బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ తీశాయి. గోపీనాథ్ మొదటి భార్య కోసరాజు మాలినీ దేవి, ఆమె కుమారుడు తారక్… సునీత నామినేషన్‌ను సవాలు చేశారు. సునీతతో గోపీనాథ్ వివాహం చట్టబద్ధం కాదని, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి మరణంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

ఈ నాటకీయ పరిణామాలు బీఆర్ఎస్‌కు రావలసిన సానుభూతి ఓటును గణనీయంగా దెబ్బతీశాయి. ఫలితాల్లో కాంగ్రెస్‌కు 98988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ 74259 ఓట్లకే పరిమితమైంది. బీజేపీ 17061  ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రచారం, బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డాయి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వాత్సల్య, ఈ ఓటమిని తట్టుకుని రాజకీయ వారసుడిగా ఎదుగుతాడా, లేక తన మార్గాన్ని మార్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Read Also: Kavitha: జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత ట్వీట్.. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అన్నకు కౌంటర్!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×