BigTV English

Naga Vamsi: పాపం ప్లాప్స్ లో ఉన్నాడు, విజయ్ దేవరకొండ పై జాలి చూపించండి

Naga Vamsi: పాపం ప్లాప్స్ లో ఉన్నాడు, విజయ్ దేవరకొండ పై జాలి చూపించండి

Naga Vamsi On Vijay Devarakonda : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషన్ హీరో అంటే వినిపించే పేరు విజయ్ దేవరకొండ. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరయిపోయాడు. చిన్న సినిమాగా వచ్చిన పెళ్లిచూపులు పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.


విజయ్ దేవరకొండ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా విజయ్ ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టింది. సందీప్ రెడ్డి వంగ అనుకున్న కథను అదేవిధంగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేశాడు. అలానే విజయ్ నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో ఉన్న ఆటిట్యూడ్ ను విజయ్ బయట కూడా చూపించాడు అంటూ చాలామంది అప్పటినుంచి కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

ప్లాప్స్ లో ఉన్నాడు జాలి చూపించండి 


విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న విషయం తెలిసింది. ఈ తరుణంలో నాగ వంశీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూస్ లో భాగంగా విజయ్ దేవరకొండ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘ విజయ్ దేవరకొండ ను ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కాదు. వయసులో ఉన్నప్పుడు ఏదో మాట్లాడాడు, పాపం ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు కదా. అయినా కూడా ట్రోల్ చేయటం ఆపడం లేదు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని పట్టుకొని ఏదేదో రాశారు. రెట్రో సినిమా ఈవెంట్లు మామూలుగా మాట్లాడిన మాటలు కూడా విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేశారు. ఆఫ్ స్టేజ్ లో కలిస్తే విజయ్ దేవరకొండ ఎంత కూల్ గా ఉంటాడో అందరికీ అర్థం అవుతుంది. విజయ్ ను చూస్తుంటే ఈయన నేనా మైక్ లో అలా మాట్లాడేది అని అనిపిస్తుంది. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నాడు కదా ఏమీ అనకుండా జాలి చూపించండి అంటూ ఇంటర్వ్యూలో తెలిపాడు నాగ వంశీ.

అంచనాలన్నీ కింగ్డమ్ పైన 

కింగ్డమ్ సినిమా విషయానికొస్తే గౌతమ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించినట్లు నాగవంశీ పలు సందర్భాల్లో తెలిపాడు. ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రతిసారి కూడా ఈ సినిమా లో లోపాలు చూపిస్తే నేను ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను అని చెప్తూ వచ్చాడు. అలానే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది అంటూ తెలిపాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు.

Also Read: Kothapalli lo okappudu : రానా నాయుడు ఎఫెక్ట్ తోనే, ఈ సినిమాలో కూడా బూతులు ఎంకరేజ్ చేశారా.?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×