BigTV English

HHVM Part 2 Update : వీరమల్లు పార్ట్ 2 కొంత షూటింగ్ కంప్లీట్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.?

HHVM Part 2 Update : వీరమల్లు పార్ట్ 2 కొంత షూటింగ్ కంప్లీట్.. సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్.?

HHVM Part 2 Update :హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu).. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది . అభిమానుల ఆసక్తికి తెర దించుతూ.. ఫైనల్ గా హరిహర వీరమల్లు సినిమాని జూలై 24న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు సినిమా కోసం వెయిట్ చేసి.. వెయిట్ చేసి పవర్ స్టార్ అభిమానుల్లో అసహనం మొదలైంది. ఈ సినిమా ఇంకెప్పుడు రిలీజ్ చేస్తార్రా బాబు అంటూ చిత్ర యూనిట్ ని లోలోపల తిట్టుకున్నారు కూడా. ఎందుకంటే చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి మళ్లీ వాయిదా వేశారు.అలా అభిమానులకి కోపం వచ్చింది. కానీ ఫైనల్ గా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హరిహర వీరమల్లు పార్ట్-2(Hari Hara Veeramallu-2) గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది ఈ సినిమాలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal). మరి ఇంతకీ హరిహర వీరమల్లు పార్ట్-2 ఎప్పుడు రాబోతుంది.. ?దీనికి సంబంధించి హీరోయిన్ ఇచ్చిన అప్డేట్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హరిహర వీరమల్లు మూవీ రెండు పార్ట్ లుగా రాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాని కరోనా టైంలోనే అనుకొని కొంత షూటింగ్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ సినిమాకి దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)వర్క్ చేశారు. కానీ కరోనా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.అయితే సినిమా కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుండి తప్పుకొని వేరే సినిమా చేశారు.ఆ తర్వాత ఈ సినిమాలోకి జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇచ్చారు.

హరిహర వీరమల్లు పార్ట్ 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్..


అలా జ్యోతి కృష్ణ(Jyothi Krishna) డైరెక్షన్లో పూర్తయిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిధి అగర్వాల్ (Niddhi Agerwal) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా దాదాపు 20 నిమిషాల షూటింగ్ కంప్లీట్ అయింది. హరిహర వీరమల్లు సినిమా విడుదలయ్యాక కొద్ది రోజులకు మళ్ళీ వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం” అంటూ హరిహర వీరమల్లు పార్ట్ 2 గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అభిమానులలో మళ్ళీ చిగురించిన ఆశలు..

ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇచ్చిన అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న ఓజీ (OG),హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) మూడు సినిమాలు మాత్రమే చేసి సినిమాలకు గుడ్ బై చెబుతారనే ప్రచారం నడుస్తున్న వేళ హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ 20 నిముషాలు కంప్లీట్ చేసాము.ఈ సినిమా విడుదలయ్యాక పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తామని హీరోయిన్ ఇచ్చిన హింట్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంలో హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ చేయడం సాధ్యమవుతుందా.. ? పవన్ వీరమల్లు 2 కి టైం కేటాయిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ:Megastar Chiranjeevi: నేడు హైకోర్టుకి చిరంజీవి.. అసలు ఏమైందంటే?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×