BigTV English

Tirupati Special Trains: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

Tirupati Special Trains:  తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, ఇక హ్యాపీగా వెళ్లొచ్చు!

SCR Special Trains: హైదరాబాద్ నుంచి తిరుపతికి భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్,  తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ AC కమ్ సెకండ్ AC, 2AC, 3AC, 3 AC ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపింది.


సికింద్రాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

శ్రావణమాసం కావడంతో తిరుపతికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లన్నీ ప్రయాణీకులకు కిక్కిరిసిసోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అదనపు రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.  ఇవాళ, రేపు (ఆగస్టు 17, 18 తేదీలలో) తిరుపతి, సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.


తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్

రైలు నంబర్ 07097 తిరుపతి – సికింద్రాబాద్ రైలు ఆగష్టు 17న ఆదివారం నాడు తిరుపతి నుంచి బయల్దేరి సికింద్రాబాద్ కు వస్తుంది. రైలు నంబర్ 07098 సికింద్రాబాద్ – తిరుపతి రైలు ఆగస్టు 18 సోమవారం నాడు తిరుపతి నుంచి బయల్దేరి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

Read Also: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి రాయితీ దొరుకుతుంది!

ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

తిరుపతి- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే ప్రత్యేక రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యెర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి మరియు బేగంపేట రైల్వే స్టేషన్లలో రెండు వైపులా ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ AC కమ్ సెకండ్ AC, 2AC, 3AC, 3 AC ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని తెలిపింది. ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ రైళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలని సూచించారు. రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:  రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చా? ఇదీ అసలు విషయం!

Related News

Indian Railways Ticket: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Train Derailed: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Tirumala crowd: తిరుమలలో భక్తుల వెల్లువ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలకుపైగానే.. టీటీడీ ప్రకటన ఇదే!

Confirmed Railway Ticket: కన్ఫార్మ్ టికెట్ పక్కా.. సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Free Train Travel: రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చా? ఇదీ అసలు విషయం!

Big Stories

×