BigTV English

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

Nagarjuna: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోస్ లో నాగార్జున ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నాగార్జున, ఎన్నో వైవిధ్యమైన సినిమాలు కూడా చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం నాగార్జున కూలీ సినిమాలో చేసిన పాత్ర పైన విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు అలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నావు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.


అక్కినేని నాగేశ్వరరావు తనయుడుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు నాగర్జున. అయితే వారసత్వం అనేది సినిమా ఓపెనింగ్ డే టిక్కెట్ కొనడానికి మాత్రమే పనికొస్తుంది. ఆ తర్వాత టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఈ విషయం నాగార్జున కూడా బాగా అర్థమైనట్లుంది. అందుకే దర్శకుడు మణిరత్నం వెనకాల వెంటపడి మరి గీతాంజలి సినిమాను చేయించుకొని సూపర్ సక్సెస్ అందుకున్నారు.

ఆ దర్శకుడిని పీడించారు


నాగార్జున సినిమాలు చేస్తున్న సరే సరైన గుర్తింపు రావడం లేదు. ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు దర్శకత్వంలో మజ్ను సినిమా చేశాను. మజ్ను సినిమా నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇతనులో యాక్టర్ ఉన్నాడు అని చాలామందికి అర్థం అయింది. ఆఖరిపోరాటం సినిమాతో కమర్షియల్ బ్రేక్ వచ్చింది. కానీ అది రాఘవేంద్రరావు, శ్రీదేవి కు ఎక్కువ క్రెడిట్. ఆ తర్వాత నేను చేసేవి నాకే నచ్చట్లేదు.

నాకు నచ్చింది నేను చేయాలి అని ఫిక్స్ అయ్యి ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకొని నేను మణిరత్నం వెనకాల పడ్డాను. మణిరత్నం మౌనరాగం సినిమా నేను తెలుగులో చూసా, ఆ సినిమా చూసిన తర్వాత ఆయన సెన్సిబిలిటీస్ నాకు సూట్ అవుతాయి అని అర్థమైంది. చెన్నైలో ఆయన పొద్దున్నే 6 గంటలకు వాకింగ్ కి వెళ్తారు అని తెలుసుకున్నాను. అలా ఒక నెలరోజుల పాటు ఆయన వెనక్కి పడ్డాను.

నేను పొద్దున్నే ఆయన్ని ఇంటి బయటకు వెళ్లి ఆరు గంటలకు నిల్చునే వాడిని. ఆయనతోపాటు పది నిమిషాలు నడవనిచ్చేవారు. తర్వాత ఆయన టెన్నిస్ ఆడడానికి వెళ్లిపోయేవారు. ఆయనను కన్విన్స్ చేయడం వలన గీతాంజలి సినిమా బయటకు వచ్చింది. ఆయన ఈ సినిమాను తమిళ్లో చేస్తాను అన్నారు. మీకు ఆల్రెడీ తమిళ్ లో మార్కెట్ ఉంది తెలుగులో చేయండి అని చెప్పాను.

గీతాంజలి అలా బయటకు వచ్చింది

మొత్తానికి నాగర్జున దర్శకుడు మణిరత్నం ను అలా కన్విన్స్ చేయడం వలన గీతాంజలి సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంతటి సక్సెస్ అందుకుంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ప్రేమకథ సినిమాల ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు గీతాంజలి.

Also Read: Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

Related News

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

AR Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

Big Stories

×