is Sonakshi Sinha Pregnant: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీలో దబాంగ్, ఆర్ రాజ్‌కుమార్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇక రజనీకాంత్ లింగా చిత్రంతో తమిళ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ భామ తెలుగులో ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం బాలీవుడ్ భామలంత టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు. ఎలాంటి అవకాశం వచ్చిన తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆలియా భట్, దీపికా పదుకొనె, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ తెలుగులో అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు సోనాక్షి కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
సుధీర్ బాబు హీరో వస్తున్న జటాధర మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఈ చిత్రంలోనే ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అంతేకాదు ఆమె సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేశారు. దీని ప్రకారం చూస్తే ఇందులో సోనాక్షి నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్నతొలి చిత్రం ఇదే కావడం, దీనితోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోనాక్షికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్తో ఉన్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల ఓ ఈవెంట్కి ఆమె లూజ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. దీంతో తన బేబి బంప్ కవర్ చేసుకోవడానికే ఇలాంటి డ్రెస్లో వచ్చిందంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆమె ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే సోనాక్షి గుడ్‌న్యూస్ చెప్పబోతుందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. ఈ సందర్భంగా తన భర్త జహీర్తో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ షేర్ చేసి ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేసింది. ఈ చాట్తో తాను ప్రెగ్నెంట్ కాదని స్పష్టం చేసింది. తరచూ తాను ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఎందుకు వస్తున్నాయో ఈచాట్తో వెల్లడించింది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
కానీ, వైరల్ వీడియో సోనాక్షి ఫేస్ చూస్తుంటే ఆమె నిజంగా ప్రెగ్నెంట్ అనిపించేలా ఉంది. అంతకాదు తన చేతిలో పొట్టను దాస్తున్నట్టు కూడా కనిపించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్ మరోసారి వార్తల్లో నిలిచాయి. కాగా గతేడాది సోనాక్షి, జహీర్ ఇక్బాల్‌లు పెళ్లాడింది. జూన్ 23న సైలెంట్గా ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది. ఇంట్లోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ముస్లిం, హిందు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఫోటోలు షేర్ చేసి తమ పెళ్లిని ప్రకటించింది సోనాక్షి. అయితే ముస్లింని పెళ్లి చేసుకోవడంతో సోనాక్షి సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అయితే ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తూ ఈ ట్రోల్స్కి చెక్ పెట్టింది సోనాక్షి.
Also Read: Bigg Boss 9: బాత్‌రూంలోకి వెళ్దాం రా… కెమెరాల ముందు కంటెస్టెంట్స్ ఆరాచకం..