Salaar Re release: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అయితే ఈ అక్టోబర్ నెలలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఈనెల 23వ తేదీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)పుట్టినరోజు(Birthday) కావడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ (Salaar)సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ నెల 23వ తేదీ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో మరోసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ కావడానికి సిద్ధమవుతుంది. ఇదే విషయాన్ని చిత్ర బృందం కూడా అధికారికంగా వెల్లడించారు.ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతుందని తెలియగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్టోబర్ 31వ తేదీ తిరిగి బాహుబలి ది ఎపిక్ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇలా ప్రభాస్ సినిమాలు వరుసగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ప్రభాస్ ప్రతి ఏడాది ఓ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. గత ఏడాది కల్కి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్ ఈ ఏడాది మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్ర ద్వారా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పుడు వరుస రీ రిలీజ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు.
విడుదలకు సిద్ధమవుతున్న ది రాజా సాబ్…
ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా ఈయన సలార్2, కల్కి 2, స్పిరిట్ సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో జగపతిబాబు, పృధ్విరాజ్ సుకుమారన్, శ్రేయ రెడ్డి వంటి తదితరులు కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.
Also Read: Avika Gor: పెళ్లి పై ట్రోల్స్..సంతోషంగా ఉందన్న అవికా గోర్.. ఏమైందంటే?