BigTV English

AR Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

AR Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

AR Muragadas: ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా తీసిన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మిగతా ఇండస్ట్రీలు చూసే స్థాయి మారిపోయింది. కేవలం సినిమా హిట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకే ఒక గౌరవం తీసుకొచ్చింది బాహుబలి సినిమా. బాహుబలి సినిమా తర్వాత చాలామంది దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటూ అడుగుల ముందుకు వేశారు. వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి మరికొన్ని ఫెయిల్ అయ్యాయి.


ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత సుకుమార్ పుష్ప, నాగ అశ్విన్ కల్కి వంటి సినిమాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. త్రిబుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ దర్శకులు ఉన్నారు అని అందరికీ ఒక నమ్మకం వచ్చేసింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా నచ్చితే ఎంత ఆదరిస్తారు అని కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఈ తరుణంలో తమిళ దర్శకుడు మురగదాస్ ఒక కామెంట్ చేశారు.

అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు.?


తమిళ దర్శకుడు మురగదాస్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు గజిని సినిమాతోనే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అలానే ఆయన దర్శకత్వం వహించిన రమణ సినిమా తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ అయింది. శంకర్, మణిరత్నం వంటి దర్శకులు ప్రస్తుతం డిజాస్టర్ సినిమాలు తీస్తున్నారు. ఈ తరుణంలో ఒక ఇంటర్వ్యూలో మురగదాస్ మాట్లాడుతూ… ” 1000 కోట్లు సినిమా తీసే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. కానీ తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తారు అంటూ మాట్లాడారు” అయితే దీన్నిబట్టి 1000 కోట్లు తీసిన దర్శకులని మురగదాస్ తక్కువ చేసినట్లే.

ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. మీరు షెడ్ కి వెళ్ళిపోవడం వలన ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా అంటూ మురగదాస్ ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అలానే మురగదాస్ కి ట్రోలింగ్ కొత్తేమీ కాదు చాలా సినిమాలు నుంచి జరుగుతూనే ఉంది. చాలావరకు కథలను కాపీ కొడతాడు అంటూ గతంలో కూడా విమర్శలు వచ్చాయి.

రిలీజ్ కు ముందు కాంట్రవర్సీ 

ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా మదరాసి అనే సినిమాను చేస్తున్నాడు మురుగదాస్. వాస్తవానికి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలానే తెలుగు ప్రేక్షకులు కూడా శివ కార్తికేయన్ సినిమాను ఆదరిస్తారు. ఇటువంటి తరుణంలో ఇలా కామెంట్ చేయడం అనేది, సినిమాకు నష్టం కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే 1000 కోట్లు దర్శకులు తెలుగులోనే ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ పంచాయతీ ఎక్కడ వరకు సాగుతుందో చూడాలి.

Also Read: Rachitha Ram: చూడ్డానికి అమాయకంగా ఉంది కానీ, అల్లాడించింది మామ

Related News

Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

Big Stories

×