Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవ మన్మధుడిగా పేరు సొంతం చేసుకున్నారు కింగ్ నాగార్జున (Nagarjuna) .. వయసు మీద పడుతున్నా.. ఇంకా యంగ్ హీరోలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. ఇకపోతే హీరోగా సినిమాలకు ఈమధ్య పుల్ స్టాప్ పెట్టినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న నాగార్జున.. తాజాగా తన స్నేహితుడు, ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’కి మొదటి గెస్ట్ గా విచ్చేశారు. తొలి ఎపిసోడ్ లో భాగంగా నాగార్జునకు సంబంధించిన పలు విషయాలను ప్రోమోల ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ డైరెక్టర్ వెంట పడ్డాను అంటున్న నాగార్జున..
ఈ క్రమంలోనే జగపతిబాబుతో సందడి చేసిన నాగార్జున సరదా సంగతులు పంచుకుంటూనే.. కెరియర్ ఆరంభ రోజులను గుర్తు చేసుకున్నారు.. తాను సినీ ఇండస్ట్రీలో దిగ్గజ లెజెండ్రీ కొడుకు ఏఎన్ఆర్ (ANR) కొడుకు అయినప్పటికీ ఒక డైరెక్టర్ వెంట పడ్డాను అని.. ఒక్క ఛాన్స్ అంటూ ఆయనను వేడుకున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ఏఎన్ఆర్ కొడుకు అయినప్పటికీ నాగార్జున ఆ డైరెక్టర్ వెంట పడడం ఏంటి? అసలు ఆ డైరెక్టర్ ఎవరు? మరి నాగార్జునకు ఆ డైరెక్టర్ అవకాశం ఇచ్చారా? ఆ అవకాశాన్ని నాగార్జున సద్వినియోగం చేసుకున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు అభిమానులు. మరి అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం.
కెరియర్ తొలినాళ్లల్లో ఆ కారణంగానే నా సినిమాలు చూశారు – నాగ్
తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా షో నుండి విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ..” నేను నటించిన తొలి సినిమాలను నాగేశ్వరరావు అబ్బాయి అన్న కారణంతో చాలా మంది ప్రేక్షకులు చూశారు. కొంతమంది మెచ్చుకున్నారు కూడా.. అయితే అభిమానిగా కాకుండా ప్రేక్షకుడిగా చూసిన చాలామంది నాలోని లోటుపాట్లను బయటపెట్టారు. నచ్చలేదన్నారు.. నిజానికి నన్ను సినిమాలలో చేయమంటున్నారు కదా అని ఒక 6 చిత్రాల వరకు చేశాను. ఆ క్రమంలోనే వచ్చిన ‘మజ్ను’ సినిమా నా కెరియర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. నాగార్జున లో కూడా నటుడు ఉన్నాడు అని ప్రేక్షకులు మెచ్చేలా చేసింది..
ఆ సినిమాలో బొమ్మలా ఉన్నాను – నాగ్
అయితే నాకు కెరియర్ తొలి రోజుల్లో కమర్షియల్ గా నిలిచిన చిత్రం ‘ఆఖరి పోరాటం’.. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్ శ్రీదేవి వల్లే ఇది సాధ్యమైంది.. ఈ సినిమాలో నేను ఒక్క బొమ్మలా ఉన్నాను అంతే.. నాకు నచ్చిందే చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఇక అందుకే ఆ సినిమా వారి వల్ల సూపర్ హిట్ అయిపోయింది.నాకు కమర్షియల్ విజయాన్ని అందించింది.
ఒక్క ఛాన్స్ కోసం మణిరత్నం వెంట పడ్డాను – నాగ్
నాకు మణిరత్నం (Maniratnam)దర్శకత్వం వహించిన ‘మౌనరాగం’ సినిమా అంటే చాలా ఇష్టం.ఆయన తెరకెక్కించే సున్నితమైన కథలకు నేను సరిపోతానని అనుకున్నాను. అందుకే ఆయన వాకింగ్ కి వెళ్లే పార్కు వివరాలు తెలుసుకొని మరీ దాదాపు నెలపాటు ఆయన వెంట పడ్డాను. 10 నిమిషాల పాటు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్ ఆడడానికి వెళ్లిపోయేవారు. ఎట్టకేలకు ఆయన వెంటపడి.. బ్రతిమాలి చివరికి ఒప్పించాను. అలా వచ్చిందే గీతాంజలి సినిమా.
గీతాంజలి తో భారీ సక్సెస్..
నిజానికి గీతాంజలి సినిమాను మణిరత్నం తమిళ్లో తీయాలనుకున్నారు. కానీ నేను తెలుగులో కూడా తీసి మార్కెట్ పెంచుకోండి అని చెప్పాను.. అనుకున్నట్టుగానే సూపర్ హిట్ లభించింది. నా కోరిక తీరింది అంటూ నాగార్జున వివరించారు.. మొత్తానికైతే నాగార్జున మణిరత్నం వెంటపడి మరి గీతాంజలి సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ALSO READ:Manchu Manoj: అవ్రామ్ కి అవార్డ్.. మనోజ్ పోస్ట్ వైరల్.. హమ్మయ్య కలిసిపోయినట్టేనా?