BigTV English

Vote Chori: రాహూల్ Vs ఈసీ.. అసల సమస్య ఇదే.! ఎవరి వాదన కరెక్ట్.? ఈ 65 లక్షల ఓట్లు మళ్లీ అప్‌‌లోడ్..!

Vote Chori: రాహూల్ Vs ఈసీ.. అసల సమస్య ఇదే.! ఎవరి వాదన కరెక్ట్.? ఈ 65 లక్షల ఓట్లు మళ్లీ అప్‌‌లోడ్..!

Vote Chori: ఈసీ వర్సెస్ రాహుల్ మధ్య జరుగుతున్న పోరాటంలో తప్పెవరిది? ఒప్పు ఎవరిది? రాహుల్ ఆరోపణలకు ఈసీ ఏమంటోంది? ఓట్ చోర్ గద్దే చోడ్ అనే ఈ మూమెంట్ ద్వారా రాహుల్ సాధిస్తున్నదేంటి? ఇక ఓట్ అధికార్ యాత్ర ద్వారా రాహుల్ వినిపిస్తోన్న వాయిస్ ఎలాంటిది? రాహుల్ ఆరోపణలపై భారత ప్రధాన ఎన్నికల కమిషన్ స్పందన ఎలాంటిది?


బీహార్‌లో ఓట్ల చోరీ జరిగింది -రాహూల్

బీహార్‌లో ఓట్ల చోరీ జరిగిందని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు రాహుల్ గాంధీ. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఉన్న ఓటర్లను తొలగించి కొత్త వార్ని చేర్చి అక్రమంగా గెలవాలని చూస్తున్నారని మండి పడ్డారాయన. అన్నిరాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని దేశంలో ఎక్కడ ఓట్ల చోరీ జరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు రాహుల్. అంతే కాదు బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెడితే ఈసీ అఫిడవిట్ అడగలేదని తాను ప్రెస్ మీట్ పెట్టినపుడు మాత్రమే ఈసీ అఫిడవిట్ అడగటంలో అర్ధమేంటని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఓటర్ల డేటా అడిగాని ఈసీ ఇంతవరకూ ఇవ్వలేదని ధ్వజమెత్తారు రాహుల్. మీ ఓట్లు దొంగలించి ఎన్నికల్లో గెలిచి దేశ సంపదను సంపన్నులకు దోచి పెట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్. బీహార్ లో చేస్తున్న సర్ అసలు రంగు బయట పెడతామని హెచ్చరించారు రాహుల్.


మరణించిన 22 లక్షల మంది విషయమూ ప్రస్తావన

కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ మరోమారు విచారించిన సుప్రీం ఎన్నికల సంఘం ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో.. ఆ 65 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని తేల్చిచెప్పింది. వారిని ఎందుకు తొలగించారో చెప్పాలని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఆ లిస్టును పబ్లిక్ లోకి తీసుకురావాలని కూడా సూచించింది ధర్మాసనం. ఈ అంశానికి సంబంధించి గురువారం సైతం విచారణ చేపట్టిన సుప్రీం 22 లక్షల మంది చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని ప్రశ్నించింది. బూత్ లెవల్ స్తాయిలో దీన్నెందుకు వెలుగులోకి తీసుకురాలేదని నిలదీశిసింది. పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడ్డం తమకు ఇష్టం లేదని స్పష్టం చేసింది ధర్మాసనం.

సుప్రీం తప్పు పట్టడంతో రాహూల్ వాదనకు బలం?

భారత ఎన్నికల సంఘం వాదనలను తాము పూర్తిగా విన్నామని చెప్పింది సుప్రీం కోర్టు. విచారణ సమయంలో ఈ క్రింది దశలను వారు అంగీకరించారని చెప్పింది. 2025 జాబితాలో పేర్లు కనిపించినప్పటికీ తాజా జాబితాలో చేర్చని 65 లక్షల మంది ఓటర్ల జాబితాను జిల్లా స్థాయి వెబ్ సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది సుప్రీం. బీహార్ సర్ వ్యవహారంలో సుప్రీం కూడా ఈసీని తప్పు పడుతుండటంతో.. రాహుల్ వాదనకు బలం చేకూరినట్టు అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. రాహుల్ ఈ ఓట్ చోరీ వ్యవహారంలో అమితుమీ తేల్చేందుకు బీహార్ పోల్ బందర్ లో ఓట్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఆగస్టు 17 నుంచి 16 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. మొత్తం 25 జిల్లాల్లో 1300 కిలోమీటర్ల వరకూ యాత్ర చేయనున్నారు రాహుల్. సెప్టెంబర్ 1న పట్నాలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది.

మహారాష్ట్రంలో కోటి మంది కొత్త ఓట్లను సృష్టించారు

ఈ సందర్బంగా మాట్లాడిన రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు. బీజేపీ చెప్పుచేతల్లో ఈసీ నడుస్తోందని అన్నారు. ఈసీని వీడియో క్లిప్పింగ్ లు అడిగినా ఇవ్వడం లేదన్నారు రాహుల్. మహదేవర పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయన్నారు. బీహార్ లోనూ ఓటు చోరీకి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రాహుల్. బీహార్ ప్రజలు బీజేపీ ఓటు చోరీని అడ్డుకుంటారని చెప్పారు. పేదల దగ్గరున్న బలం ఓటు హక్కు ఒక్కటేనన్నారు. బీహార్ లో ఓటు చోరీని ఎలాగైనా అడ్డుకుంటామన్నారు రాహుల్. అయితే తాము సర్ పేరిట చేస్తున్న ఓటర్ల ప్రక్షాళనపై రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్.. జ్ఞానేష్ కుమార్. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడమేనంటారాయన. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్.

ఒకరేమో రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ పోరాట యాత్ర అంటారు. మరొకరు చూస్తే.. ఇలాంటి ఆరోపణలు రాజ్యాంగాన్ని అవమానించడమేనంటారు. ఈ రెండు వాదనల్లో నిజా నిజాలేవి? ఎవరి వాదన ఓటర్లు కరెక్టుగా భావించాలి? ఎవరి వాదన వైపు నిలవాల్సి ఉంది? ఆ వివరాలేంటి? ఇక్కడెలాంటి వివక్షలేదు. అంతా కక్ష్యలో ప్రవేశ పెట్టడానికే ఇదంతా అంటారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ఓటర్ల జాబితా అంతా డొల్లతనమనీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఇటీవల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రజెంటేషన్లు, వీడియోలతో రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు. ఓట్లను దొంగిలిస్తున్నారని.. EC తమకు డిజిటల్‌ కాపీ ఇవ్వడం లేదనీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆధారాలు చూపాలనీ, అఫిడవిట్లు ఇవ్వాలని EC రాహుల్ కి సూచించినా ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. భారత ఎన్నికల సంఘం SIR తోపాటు.. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది.

మాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్న జ్ఞానేష్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఓట్ చోరీ, SIR గురించి చేస్తున్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు.. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జ్ఞానేష్ కుమార్.. ఓటర్లను తప్పుదారి పట్టించడానికి జరిగిన విఫల ప్రయత్నాలు.. రాజ్యాంగాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీల సమక్షంలోనే ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్నారు. ఆయా రాజకీయ పార్టీలు కావాలనే ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. SIR పైనా అసత్య ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు. బిహార్ ఓటర్ల సవరణ అంశంపై వివరణ ఇచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చన్నారు. ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు లేవు.. ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు.. పౌరులు, పార్టీల మధ్య ఈసీ ఎలాంటి వివక్ష చూపించదన్నారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. అన్ని రాజకీయ పార్టీలను మేం సమానంగా చూస్తాం.. బిహార్‌లో చేపట్టిన SIR విధానంలో అని పార్టీలను భాగస్వామ్యం ఉందన్నారు. కొందరు ఓట్ చోరీ పేరుతో అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారు.. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించడమేనంటారాయన.

ఓటర్ల ఫోటో చూపడం తప్పు- ప్రధాన ఎన్నికల కమిషనర్

నకిలీ పేర్లు – మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ వంటి పార్టీలకు మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాలు ఎందుకు ఇవ్వలేదో సమాధానమిచ్చారు. ఇది ఓటరు గోప్యతకు సంబంధించిన వ్యవహారం. నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ విషయం సుప్రీం కోర్టు 2019 లోనే చెప్పిందని అన్నారాయన. కొందరు ఓటర్లు పలు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నారని అన్నారు సీఈసీ. ఆ మాటకొస్తే.. ఓటర్ల ఫోటోలను వారి అనుమతి లేకుండా మీడియాకు చూపడం తప్పన్నారు ఈసీ. ఇలాంటి ప్రజంటేషన్లను తాము గుర్తించినట్టు చెప్పారు. డూప్లికేట్ లేదా ప్రాక్సీ ఓటింగ్ జరిగిందో లేదో తెలుసుకోడానికి పోలింగ్ స్టేషన్ల నుంచి ఫుటేజీలను కోరినట్టు చెప్పారాయన. వీడియోల షేరింగ్ విషయంలోనూ ఎన్నో గోప్యతా సమస్యలున్నాయని అంటారు సీఈసీ. రాహుల్ గాంధీ పదే పదే సీసీ ఫుటేజీ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారని. ఆయా వీడియోల్లో ఒకరి తల్లి కావచ్చు, కోడలు, సోదరి ఉండొచ్చు. అలాంటి వారి వివరాలను ఎలా బహిర్గతం చేస్తామని ప్రశ్నించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఓటరు జాబితాలో పేరున్న వారు మాత్రమే ఓటు వేయగలరని. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు సీఈసీ జ్ఞానేష్ కుమార్.

Also Read: ఏపీ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్.. వాట్సాప్‌లో 700 సేవలు.. ఆ సమస్యలకు చెక్.!

సుమారు కోటి ముప్పై లక్షల మంది ఎన్నికల అధికారులు, బూత్-లెవల్ ఏజెంట్లు, అభ్యర్థుల ప్రతినిధులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.. ఇంత పారదర్శక ప్రక్రియలో ఎవరైనా ఓట్లను దొంగిలించగలరా? అని నిలదీశారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ప్రజలు రెండుసార్లు ఓటు వేశారనే ఆరోపణలకు తగిన ఆధారాలు ఇప్పటి వరకూ తమకు చేరలేదన్నారాయన. భారత రాజ్యాంగం ప్రకారం, భారత పౌరులు మాత్రమే.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేయగలరని స్పష్టం చేశారు సీఈసీ జ్ఞానేష్ కుమార్. ఇతర దేశాల ప్రజలకు ఈ హక్కు లేదు. అలాంటి వ్యక్తులు లెక్కింపు ఫారమ్ నింపినట్లయితే, SIR ప్రక్రియ సమయంలో వారు కొన్ని పత్రాలను సమర్పించడం ద్వారా తమ జాతీయతను నిరూపించుకోవాలి. దర్యాప్తు తర్వాత వారి ఆధారాలు సరిపోకుంటే.. తొలగిస్తామని అన్నారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇపుడీ రెండు వాదనల్లో ఏది నిజం? ఓటర్లు ఎవరి వాదన కరెక్టని భావించాలి? ఇందులో నిజానిజాలెంత? త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా ఈ విషయంలో ఓటర్ల నాడి ఇదని స్పష్టంగా తేల్చుకోవచ్చా? తేలాల్సి ఉంది.

Stroy By Adinarayana, Bigtv

Related News

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

MLA Report: సీటు ఉన్నట్లా? ఊడినట్లా? టీడీపీ నేతల్లో గుబులు..

BJP Leaders Fights: డీకే అరుణ Vs శాంతి కుమార్.. పాలమూరు బీజేపీలో పంచాయితీ

TG Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్

Tirupati TDP: తిరుపతిలో టీడీపీకి దిక్కెవరు?

Big Stories

×