Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో…. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో అద్భుతంగా ఆడిన… గిల్ అలాగే మహమ్మద్ సిరాజ్ లను పక్కకు పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే ఈ ఇద్దరు లేకుండానే ఆసియా కప్ ఆడనుంది టీమిండియా. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
Also Read: Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?
ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ఇదే
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో.. టీమిండియా జట్టును ప్రకటించే దిశగా అడుగులు వేసుకొని భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇందులో భాగంగానే అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… కీలక ప్లేయర్లు దూరమవుతారని… కూడా చెబుతున్నారు. అయితే ఈ లిస్టులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ ( shubman gill) అలాగే మహమ్మద్ సిరాజ్ ( Mohamaed Siraj) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ప్లేయర్లను టీమిండియా జట్టులోకి తీసుకోకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. అంతేకాదు అభిషేక్ శర్మ అలాగే సంజు ను ఓపెనర్లుగా బరిలోకి దించేందుకు… బిసిసి ఐ నిర్ణయం తీసుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
యశస్వి జైస్వాల్ ను తొలుత ఆడించకూడదని.. అతని టెస్టులకే పరిమితం చేయాలని అనుకుంది బీసీసీఐ. కానీ ఇప్పుడు అతని మూడవ వికెట్ కు బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. శివం దూబే అలాగే వాషింగ్టన్ సుందర్ ఇద్దరినీ కూడా జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రింకు సింగ్ ను కాదని జితేష్ శర్మను… జట్టులోకి తీసుకోబోతున్నారట. జితేష్ శర్మ జట్టులోకి వస్తే ఎక్స్ట్రా వికెట్ కీపర్ గా కూడా పనికి వస్తాడు. ప్రసిద్ధి కృష్ణ అలాగే హర్షిత్ రానా ఇద్దరిలో ఒకరు ఫైనల్ కావచ్చు అని తెలుస్తోంది. బుమ్రా మాత్రం తుది జట్టులో ఉంటాడని ఇప్పటికే సమాచారం అందించిందట బిసిసిఐ.
Also Read: Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం… సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగునుంది. సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.