E-Paper
Advertisement

Dhruv Vikram: ధృవ్ విక్రమ్ పేరుతో మోసం.. అలర్ట్ చేసిన నటుడు.. ఏం జరిగిందంటే?

Dhruv Vikram: ధృవ్ విక్రమ్ పేరుతో మోసం.. అలర్ట్ చేసిన నటుడు.. ఏం జరిగిందంటే?
Advertisement

Dhruv Vikram: ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా వరకు మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విధమైనటువంటి ఇబ్బందులను సెలబ్రిటీలు ఎదుర్కొంటున్నారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను అలాగే వారి వాయిస్ కూడా ఉపయోగిస్తూ ఎంతోమంది భారీగా లాభాలు పొందుతున్నారు. ఈ తరుణంలోనే ఇదివరకు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మరొక యంగ్ హీరోకి కూడా ఇలాంటి సమస్య వచ్చిందని చెప్పాలి.

ఏఐ వాయిస్, ఫోటోలు..

ప్రముఖ సీనియర్ నటుడు విక్రమ్ (Vikram) వారసుడిగా ఇండస్ట్రీలోకి ధృవ్ విక్రమ్(Dhruv Vikram) హీరోగా అడుగు పెట్టారు. తాజాగా ధృవ్ విక్రమ్ బైసన్(Bison) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ధృవ్ విక్రమ్ ప్రమేయం లేకుండా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లో క్రియేట్ చేస్తూ తన ఫోటోలను అలాగే ఏఐ జనరేటర్ వాయిస్ సోషల్ మీడియాలో ఉపయోగిస్తూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ధృవ్ విక్రమ్ టీమ్ స్పందిస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

ఇంస్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉంది..

Advertisement

ఈ సందర్భంగా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ గురించి ధృవ్ విక్రమ్ టీమ్ స్పందిస్తూ.. మీడియా, ప్రెస్, ఫ్రెండ్స్ అలాగే అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ తనకు సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి అకౌంట్స్ లేవని క్లారిటీ ఇచ్చారు. తనకు కేవలం ఇంస్టాగ్రామ్ అకౌంట్ మాత్రమే ఉందని అది కూడా Instagram: – dhruv.vikram. ఈ పేరుతో ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇంస్టాగ్రామ్ మినహా తనకు ఫేస్ బుక్, ట్విట్టర్, స్నాప్ చాట్ వంటి ఇతర ఎలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లేవని తెలియజేశారు.

ఫేక్ అకౌంట్స్..

Advertisement

ఇటీవల కాలంలో ఏఐ ద్వారా ధృవ్ విక్రమ్ ఫోటోలను అలాగే తన వాయిస్ ను ఫేక్ అకౌంట్(Fake Account) లో తప్పుగా వినియోగిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉందని తెలిపారు. ఇలాంటి మోసాల నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందిగా తెలియజేశారు. అంతేకాకుండా ధృవ్ విక్రమ్ ఏదైనా కొత్తగా సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ విషయాన్ని తాము అధికారకంగా వెల్లడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరు మీద ఎన్నో మోసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు స్పందిస్తూ అభిమానులను అలర్ట్ చేస్తున్నారు.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×