BigTV English

Nandamuri Balakrishna: క్రిష్ తో బాలయ్య మరోసారి.. వీరమల్లులానే సగంలో వదిలేయడు కదా

Nandamuri Balakrishna: క్రిష్ తో బాలయ్య మరోసారి.. వీరమల్లులానే సగంలో వదిలేయడు కదా

Nandamuri Balakrishna: ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా ఒక హిట్ కొట్టాడు అంటే కచ్చితంగా స్టార్ హీరోల్లో ఒక్కరైనా సరే వారికి అవకాశం ఇవ్వడం ఆనవాయితిగా మారింది. కుర్ర డైరెక్టరరా ..?  సీనియర్ డైరెక్టరా.. ? లేకపోతే అంతకుముందు హీరోలతో చేసిన డైరెక్టరా.. ? అనేది  కూడా చూడకుండా .. ఒక హిట్టు పడిన తర్వాత మరోసారి ఆ డైరెక్టర్ వెనుక స్టార్ హీరోలు క్యూ కడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఏ డైరెక్టర్ వెనుక క్యూ కట్టారు అనే విషయానికొస్తే హరిహర వీరమల్లు సినిమా ఈ గురువారం రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే.


 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా ఆ తర్వాత ఆ ప్లేస్ ను జ్యోతి కృష్ణ రీప్లేస్ చేశాడు. మొదటి సగభాగం క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన  విషయం తెలిసిందే. ఇక సినిమాలో కూడా ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపించిందని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇక వీరమల్లు రిలీజ్ తర్వాత డైరెక్టర్ క్రిష్ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.  వీరమల్లు సినిమాను కొద్దిగానే తెరకెక్కించినా అతని గుర్తింపు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక దీంతో క్రిష్ కు వరుస అవకాశాలు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ..  క్రిష్ కు మరోసారి అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. అయితే వీరమల్లు తరువాత ఈ అవకాశం రాలేదని, బాలయ్య- క్రిష్ కాంబో ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయంతో పాటు మరెన్నో ట్రోల్స్ ను అందుకుంది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా తర్వాత క్రిష్ -బాలయ్య కాంబోలో కథానాయకుడు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో మైథాలజికల్ సినిమాలే దూసుకుపోతున్న కారణంగా మరోసారి ఈ కాంబోలో ఒక మైథాలజికల్ సినిమా రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం క్రిష్ అనుష్కశెట్టితో ఘాటీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ సినిమా షూటింగ్  ఫినిష్ అయ్యి రిలీజ్ డేట్ కోసం తర్జనభర్జనలు పడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించనుంది. ఇక దీని తర్వాత క్రిష్.. బాలయ్య కోసం కథను రెడీ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఇంకోపక్క బాలయ్య కూడా అఖండ 2 ను ఫినిష్ చేసి సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అఖండ 2 తర్వాత బాలయ్య,  క్రిష్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం.

 

గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తుంది అని అంటే ఇప్పటినుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.  వీరమల్లులా క్రిష్ ఈ సినిమాను కూడా మధ్యలో వదిలేయడుగా అని కొందరు.. వదిలితే బాలయ్య ఊరుకుంటాడా.. ? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  మరి ఈ వార్తలో నిజం ఎత అబద్ధం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Related News

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

‎Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!

‎Manchu Lakshmi: అర్హ హైడ్రోజన్ బాంబ్… దెబ్బకు భయపడిపోయిన మంచు లక్ష్మీ!

Teja Sajja: ప్రభాస్, ఎన్టీర్ తరువాత ఆ రికార్డు సొంతం చేసుకున్న తేజ సజ్జ!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

Big Stories

×