School Building collapse: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. చదువుకునేందుకు పొద్దున్నే బడికెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. ఝాలవర్‌లో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలింది. నలుగురు విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల కింద మరో 40 మంది చిన్నారులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసేందుకు గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగం కూడా రంగంలోకి దిగి రెస్క్యూ మొదలుపెట్టింది.
శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు..
ఘటనా స్థలానికి చేరుకున్న ఝలావర్ కలెక్టర్, ఎస్పీ అమిత్ కుమార్ అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జెసిబి యంత్రాల సహాయంతో శిథిలాలను తొలగించే పనులు శరవేగంగా కొనసాగించారు. గాయపడిన విద్యార్థులను అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు సమిష్టిగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీ రాజధాని అమరావతిపై.. విషం చిమ్మిన కేతిరెడ్డి
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొవాలని స్థానికులు డియాండ్..
మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ దుర్ఘటన పాఠశాల భవనాల నిర్మాణ నాణ్యత నిర్వహణపై తీవ్ర చర్చను రేకెత్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు శిథిలావస్థలో ఉండటం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కుప్పకూలిన స్కూల్ పై కప్పు.. చిక్కుకున్న చిన్నారులు..
రాజస్థాన్ ఝలావర్ లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోయింది
అనేక మంది పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం
కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/GUKEsocy6L
— BIG TV Breaking News (@bigtvtelugu) July 25, 2025