Nandamuri Balakrishna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలయ్య గురించి ప్రత్యకించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ అనే షో తర్వాత బాలయ్య అందరివాడు అయిపోయారు. బాలయ్య వ్యక్తిత్వం ఏంటో ఆ షో ద్వారా బయటికి వచ్చింది. ఆ షో తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకున్నాయి.
ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాను బాలయ్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇదివరకే విడుదలైన వీడియో కూడా మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు ఇదివరకే అనౌన్స్ కూడా చేశారు. ఇకపోతే ఈ తరుణంలో బాలకృష్ణ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు.
ప్రజలకు హెచ్చరిక!
“బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ
ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికి నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం విషయం ఏమిటంటే..
ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు.హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు.కాబట్టి దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు
కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు. అంటూ నందమూరి బాలకృష్ణ తెలిపారు.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్
మరోవైపు బాలకృష్ణ సినిమాల్లో, రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోయే అఖండ 2 సినిమా తర్వాత, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీని గురించి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈసారి ఏ స్థాయి సక్సెస్ ఫుల్ సినిమా క్రిష్ అందిస్తాడో వేచి చూడాలి.
Also Read: Naa Anveshana: హరిహర వీరమల్లు రివ్యూ కి ఎన్ని డబ్బులు వచ్చాయంటే, ప్రపంచయాత్రికుడు షాకింగ్ సీక్రెట్స్