Naa Anveshana: ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి దేశం వెళ్లి అక్కడ ఆహారపు అలవాట్లను, అక్కడ మర్యాదలను, అక్కడ పద్ధతులను కొంతమందికి చూపిస్తూ బాగా ఫేమస్ అయ్యాడు అన్వేష్. అన్వేష్ కి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి.
కొన్నిసార్లు అన్వేష్ మాట్లాడే విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లపై అన్వేష్ మాట్లాడి చాలామంది దృష్టిని ఆకర్షించాడు. అలానే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళందరికీ అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చాడు. బెట్టింగ్ యాప్స్ పైన ఒక పెద్ద పోరాటమే చేశాడు అన్వేష్. అక్కడితో అన్వేష్ మీద రెస్పెక్ట్ చాలామందికి మరింత పెరిగిపోయింది.
హరిహర వీరమల్లు రివ్యూ కి వచ్చిన డబ్బులు
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కంప్లీట్ గా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించలేదు అనేది వాస్తవం. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు ఈ సినిమా రివ్యూ ని అన్వేష్ చెప్పాడు. అప్పుడికి అన్వేష్ సినిమా కూడా చూడలేదు. కానీ ఆ వీడియోకి మాత్రం విపరీతమైన వ్యూస్ వచ్చాయి. దగ్గర దగ్గర కేవలం ఆ ఒక్క వీడియోకి 1,60,000 రెవెన్యూ వచ్చింది. దీనిపై అన్వేష్ స్పందిస్తూ…. రీసెంట్ గా రెండు రిస్క్ ఉన్న దేశాలు వెళ్లాను దాని వలన దాదాపు రెండు లక్షల వరకు నష్టం జరిగింది. కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా సినిమా రివ్యూ చెప్పడం వలన లక్ష అరవై వేల రూపాయలు వచ్చింది. దీనిని బట్టి చూస్తుంటే రివ్యూలు చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. ఇదేదో పతి యాపరం బాగానే ఉంది అంటూ మాట్లాడాడు అన్వేష్.
సినిమా చూసి చెప్పుంటే ఇంకా డబ్బులు
అయితే అన్వేష్ మాట్లాడుతూ సినిమా చూడకుండానే రివ్యూ చెప్పడం వలన ఇన్ని డబ్బులు వచ్చాయి. ఒకవేళ సినిమా చూసి రివ్యూ చెప్పుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చావేమో అంటూ తెలిపాడు. ఇక హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ పైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో మరోవైపు నుంచి చిత్ర యూనిట్ కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ అఫీషియల్ గా పోస్టర్లను రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. ఈ సినిమాకి సంబంధించి పార్ట్ టు కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించి దాదాపు 20 శాతం షూటింగ్ కూడా అయిపోయింది అని అధికారికంగానే ప్రకటించారు.
Also Read: Hari Hara VeeraMallu: తిరుపతిలో చిన్నారుల కోసం హరిహర వీరమల్లు సినిమా స్పెషల్ షో