OTT Movie : ఓటీటీలో ఒక కొత్త సినిమా సంచలనం సృష్టిస్తోంది. విమర్శకులు కూడా ఈ సినిమాని ప్రశంసిస్తున్నారు. ఇది టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇది 82వ వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ సినిమాలో ఉండే పొలిటికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కి, ఒక్క క్షణం కూడా కళ్ళను తిప్పు కోలేరు. ఒక న్యూక్లియర్ మిస్సైల్ అమెరికాకు వస్తుంది. దాన్ని ఎలా ఆపాలి, ఎవరితో ఫైట్ చేయాలి అనే థ్రిల్లింగ్ సీన్స్ తో ఈ కథ నడుస్తుంది. ఈ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..
‘ఎ హౌస్ ఆఫ్ డైనమైట్’ (A House of Dynamite) కాథరిన్ బిగెలో డైరెక్ట్ చేసిన అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఇద్రిస్ ఎల్బా (ప్రెసిడెంట్), రెబెక్కా ఫెర్గుసన్ (క్యాప్టెన్ వాకర్), గాబ్రియల్ బాసో (ఎయిడ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 24 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతుంది. ఐయండిబి లో 7/10 రేటింగ్ పొందింది.
ఈ కథ అమెరికాకు ఒక పెద్ద మిస్సైల్ లో న్యూక్లియర్ బాంబును ఎవరో పంపడంతో స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరు పంపారో ఎవ్వరికీ తెలీదు. కానీ 20 నిమిషాల్లో అది అమెరికా సిటీని బూడిద చేస్తుంది. అలాస్కాలో మిలిటరీ బేస్‌లో క్యాప్టెన్ వాకర్ ఈ మిస్సైల్‌ని రాడార్‌లో చూస్తుంది. ఆమె వెంటనే వైట్ హౌస్‌కి ఫోన్ చేసి అలర్ట్ చేస్తుంది. ప్రెసిడెంట్ తన టీమ్‌తో మీటింగ్ పెడతాడు. “ఇది ఎవరు పంపారు? రష్యా? చైనా? లేక వేరే ఎవరైనా?” అని అందరూ గందరగోళంలో ఉంటారు. మిస్సైల్‌ని ఆపాలా? ఎవరిపై రిటర్న్ అటాక్ చేయాలి? అని అందరూ హడావిడిగా డిస్కస్ చేస్తారు.
Read Also : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్
వాకర్ టీమ్ మిస్సైల్‌ని బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ టీమ్ రష్యా, చైనా మీద డౌట్ పడుతుంది. కానీ ఆ దేశాలు దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. వాకర్ మిస్సైల్ ను ట్రాక్ చేసినప్పుడు, అది ఒక టెర్రర్ గ్రూప్ నుండి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రెసిడెంట్ రిటర్న్ అటాక్ ప్లాన్ చేస్తాడు. కానీ యుద్ధం అయితే ప్రపంచం నాశనం అవుతుందని భయపడతాడు. చివరికి అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆ మిస్సైల్ పంపింది ఎవరు ? అనే విషయాలను, అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోండి.