Nayanthara:నయన తార ..లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ కొట్టేసిన ఈ తమిళ పొన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.ఇక ఒకవైపు సినిమాలతో బిజీ గా ఉంటూనే మరో వైపు మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుందన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ పిక్స్ ఇపుడు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
ఈ ఫోటోల్లో నయనతార బ్లాక్ కలర్ ఆఫ్ షోల్డర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులని మెస్మరైజ్ చేస్తుంది.లూజ్ హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్, వేసుకున్న అవుట్‌ఫిట్ చూస్తుంటే ఫ్యాషన్ విషయంలో ఆమె టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది.. ముఖ్యంగా కెమెరా ముందు ఇచ్చిన స్టైలిష్ ఫోజులు ఈ పిక్స్‌కు స్పెషల్ లుక్‌ను తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు.
నయనతార సినీ జర్నీ విషయానికి వస్తే మలయాళ సినీ ఇండస్ట్రీ ద్వారా కెరీర్ మొదలెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టి టాప్ స్టార్ గా క్రేజ్ కొట్టేసింది.ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ‘లక్ష్మి’, ‘తులసి’, నటసింహం నందమూరి బాలకృష్ణతో చేసిన ‘శ్రీరామరాజ్యం’, అక్కినేని నాగార్జునతో కలసి నటించిన ‘బాస్’
వంటి సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది.ముఖ్యంగా ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీతాదేవిగా ఆమె ఇచ్చిన ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
అటు తమిళంలో ‘రాజా రాణి’, ‘మాయ’, ‘నానుమ్ రౌడీ దాన్’, ‘అరమ్’, ‘ఇమైక్కా నొడిగల్’, ‘కోలమావు కోకిల’ వంటి డిఫరెంట్ ఫిలిమ్స్ తో సాలిడ్ గా తన సత్తా చాటింది.అందుకే అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఆమెను లేడీ సూపర్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
అలా సౌత్ లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆమె తన స్టాంప్ వేసేసింది నయన్ .బాద్‌షా షారూఖ్ ఖాన్ సరసన నటించిన ‘జవాన్’ సినిమాతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి నేషనల్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో నయనతార క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగింది.అయితే తాజాగా నయన్ నటించిన టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం నయన్ కి కాస్త డిసప్పాయింట్ అనే చెప్పాలి.
మొత్తానికి అటు సినిమా అప్ డేట్స్ తో పాటు ఇటు పర్సనల్ విశేషాలతోనూ సోషల్ మీడియాలో పంచుకునే ఈ అందాల భామ తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇపుడు నెట్టింట మంటలు పెట్టేస్తున్నాయి.చూడాలి మరి ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరించనుందో !