SS Rajamouli:తెలుగు సినిమాని ప్రపంచానికి స్థాయికి తీసికెళ్ళిన వాళ్ళలో దర్శకధీరుడు రాజమౌళిని మనం ప్రముఖంగా చెప్పుకుంటాం.అయితే మనం అనుకుంటున్నట్టుగా ఆయన సినిమాల్లో విజువల్స్, టెక్నాలజీ మాత్రమే కాకుండా సినిమా సక్సెస్ సాధించడం కోసం రాజమౌళి పాటించే మరో ముఖ్యమైన స్ట్రాటజీ ఉందంటూ రాజీవ్ కనకాల ఒక ఓ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి కెరీర్ ప్రారంభం నుంచే ఆయన థాట్ ప్రాసెస్ వేరేలా ఉండేదని రాజీవ్ చెప్పారు. తన మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబర్ వన్’ సక్సెస్ అయినప్పుడు, వచ్చిన డబ్బుతో సాధారణంగా ఇంటికోసమో లేక మరో ఖర్చుల కోసమో దాచుకుంటారని,కానీ రాజమౌళి మాత్రం ఆ డబ్బుతో మేకింగ్‌కి ఉపయోగపడే ఒక వ్యూఫైండర్ కొనుకున్నాడని ఆసక్తికరమైన విషయాలని బయట పెట్టాడు.
ఆ సమయంలో ఆయనకు సొంతంగా కంప్యూటర్ కూడా లేకపోవడంతో, శ్రీనగర్ కాలనీలోని ఒక ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లి మరీ దాని గురించి సర్చ్ చేసేవారని ,అదీ సినిమా మీద ఆయన కున్న కమిట్మెంట్ అదని జక్కన్నని ఆకాశానికి ఎత్తేశారు.
ALSO READ:గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!
ఇక సినిమాల్లో గ్రాఫిక్స్, సీజీఐ వంటి టెక్నాలజీ ఎంత వాడినా, రాజమౌళి దృష్టిలో అసలైన బలం ఎమోషన్స్ మాత్రమే అని అసలు విషయం చెప్పుకొచ్చారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, తల్లి-కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ను కూడా అంతే బలంగా చూపించడం రాజమౌళి ప్రత్యేకత అని టెక్నాలజీ అనేది ఎమోషన్‌ను సరిగ్గా చెప్పడానికి ఒక టూల్ మాత్రమేనని ఆయన నమ్ముతారని తెలిపారు.
ఇక ఇదే క్రమంలో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతం’ గురించి రాజీవ్ మాట్లాడుతూ రాజమౌళి ఎప్పటికైనా మహాభారతాన్ని ఒక భారీ కాన్వాస్‌పై, చాలా వివరంగా (డీటెయిల్డ్‌గా) తీస్తానని తనతో ఒకట్రెండు సార్లు చెప్పినట్లు తెలిపారు. మహాభారతం అంటేనే వందల పాత్రలు, ఎన్నో సబ్ స్టోరీస్ తో ఉన్న గొప్ప కావ్యం.
కాబట్టి అలాంటి స్టోరీని సినిమా గా తీసేటప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ స్టార్ హీరోకి, ప్రతీ నటుడికి అందులో ఏదో ఒక పాత్రలో నటించే అవకాశం దక్కవచ్చని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అనుభవం ఉన్న నటులే కాకుండా, ఎవరినైనా తన చేతుల్లో వేసుకుని వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య అని ఆకాశానికి ఎత్తేశారు.
చూడాలి మరి టాలీవుడ్ తో పాటు ప్రపంచమంతా ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్న మహాభారతం అనే అతి గొప్ప ఇతిహసాన్ని జక్కన్న ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో !
ALSO READ :సోషల్ మీడియాలో వేధింపులు.. ధనుంజయ్‌పై కేసు పెట్టిన రియాలిటీ షో నటి శ్రీదేవి