E-Paper
Advertisement

రెండు కాలర్లు ఎగిరేసేలా ‘డ్రాగన్ ‘ … హైప్ పెంచేస్తున్న రాజీవ్ కనకాల !

రెండు కాలర్లు ఎగిరేసేలా ‘డ్రాగన్ ‘ … హైప్ పెంచేస్తున్న రాజీవ్ కనకాల !
Advertisement

Rajeevi Kanakala On Dragon: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో రాజీవ్ కనకాల(Rajeev Kanakala) ఒకరు. చిన్న హీరోల సినిమా నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో ఎంతో కీలకమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే రాజీవ్ కనకాలకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఎన్టీఆర్(NTR) అని చెప్పాలి . వీరిద్దరి జర్నీ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలయ్యి ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు అంటే అందులో తప్పకుండా రాజీవ్ కనకాలకు ఒక పాత్ర ఉంటుందని చెప్పాలి.

ఎన్టీఆర్, రాజీవ్ బెస్ట్ ఫ్రెండ్స్…

ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని సినిమాలలో కూడా రాజీవ్ కనకాల చిన్న పాత్రలో అయినా కనిపించి సందడి చేస్తుంటారు. త్వరలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో డ్రాగన్(Dragon) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా రాజీవ్ కనకాల ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి మాత్రమే కాకుండా ఆయన నటిస్తున్న డ్రాగన్ సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఒక అణు బాంబులా డ్రాగన్…

Advertisement

ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో తాను కూడా చేస్తున్నాను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చాలా అద్భుతమైన వ్యక్తి ఆయనకు ఏం కావాలో చెప్పి మరి చేయించుకుంటారు. ఇప్పటివరకు తాను ఎనిమిది రోజులు షూటింగ్లో పాల్గొన్నాను తదుపరి నెలలో కూడా తన షూటింగ్ ఉంటుందని రాజీవ్ కనకాల తెలిపారు. డ్రాగన్ కోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి నిర్మాతలు కలిశారు. వీరందరూ కలిస్తే ఆ సినిమా ఒక అణు బాంబులాగా ఉంటుందని, ఓపెన్ హైవర్ లా ఉంటుందని రాజీవ్ కనకాల తెలిపారు. డ్రాగన్ సినిమా చూస్తే ఒక కాలర్ కాదు ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేసేలా ఉంటుందని ఈయన తెలియచేశారు.

కాలర్ ఎగరేయడం.. ఎన్టీఆర్ పై విమర్శలు..

సాధారణంగా ఎన్టీఆర్ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఫాన్స్ కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు అయితే డ్రాగన్ మాత్రం రెండు కాలర్లు ఎగరేసేలా ఉంటుందని రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇక కాలర్ ఎత్తేలా అనే పదం గురించి మొదట తానే వాడానని ఈయన తెలియజేశారు. వార్ సినిమా వేడుకలో భాగంగా ఎన్టీఆర్ కాలర్ ఎత్తుకునేలా సినిమా ఉంటుందని చెప్పారు కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరచడంతో ఎన్టీఆర్ పై భారీగా విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు రాజీవ్ కనకాల రెండు కాలర్లు ఎగరేసేలా డ్రాగన్ ఉంటుందని మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సంచలనంగా మారాయి మరి నిజంగానే డ్రాగన్ రెండు కాలర్లు ఎత్తేలా ఉంటుందా లేదంటే ఎన్టీఆర్ పై విమర్శలు చేసేలా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: దేవి శ్రీ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్..

Related News

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?

రితికా సింగ్ పేరుతో భారీ మోసం.. నెలకు రూ.400 సబ్స్క్రిప్షన్ తో భారీ దోపిడి!

చీరకట్టులో అదిరిపోయిన వాణి భోజన్.. ఈ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే!

ఇన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన రాజీవ్ కనకాల!

వయసు పెరుగుతున్నా చెక్కుచెదరని అందం.. లేడీ సూపర్‌స్టార్ క్రేజే వేరు!

రాజమౌళి మహాభారతం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? రాజీవ్ కనకాల మాటలు వైరల్!

దేవి శ్రీ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్..

Big Stories

Advertisement
×