E-Paper
Advertisement

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?
Advertisement

Varun Tej:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తమ మ్యారీడ్ లైఫ్ ని ఎంత సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తున్నారో వదులుతున్న అప్ డేట్స్ ని బట్టే అర్థం అవుతుంది.ముఖ్యంగా ఈ జంటకు సంబంధించిన ఏ చిన్న ఫొటో బయటకు వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోందని చెప్పక్కర్లేదు .తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి కర్వా చౌత్ వేడుకలను జరుపుకున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కర్వా చౌత్ అనేది ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగని తెల్సిందే. ముఖ్యంగా భర్త ఆరోగ్యంగా ఉండాలని, తమ మ్యారీడ్ లైఫ్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని భార్యలు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు.అలాంటి వేడుకను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నట్లు తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం ఫాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

Advertisement

వరుణ్ తేజ్ విషయానికి వస్తే మెగా కుటుంబం నుంచి హీరోగా పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పక్కర్లేదు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్.. ఆ తర్వాత ‘కంచె’తో నటుడిగా తనలోని అసలు టాలెంట్ ని బయట పెట్టాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు వరుణ్ కెరీర్‌లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో’ఫిదా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు వరుణ్.

ఇక ‘తొలిప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ వంటి సినిమాలతో తనలోని మరో యాంగిల్ ని చూపించాడు ఈ మెగా ప్రిన్స్. ముఖ్యంగా ‘గద్దలకొండ గణేష్’లో ఇచ్చిన ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్.ఇక . ఆ తర్వాత ‘గని’, ‘గాండీవధారి అర్జున’.మట్కా వంటి సరికొత్త ఎక్స్పరిమెంట్స్ చేసినప్పటికీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయాడు

Advertisement

మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే.. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. తన అందం, అభినయంతో మంచి క్రేజే కొట్టేసింది. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ వంటి సినిమాల్లో నటించి సత్తా చాటింది కూడా .

ఇక వరుణ్ ,లావణ్య కలిసి మిస్టర్ ,అంతరిక్షంలో కలిసి నటించగా ఆనిమాల సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. చివరకు 2023లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారని చెప్పక్కర్లేదు !మొత్తానికి కర్వా చౌత్ వేడుకల సందర్భంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పంచుకున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారాయనే చెప్పాలి.

Tags

Related News

సాహో బ్యూటీ సరికొత్త అవతారం.. ఈసారి గట్టిగానే కొట్టేలా ఉందిగా!

రితికా సింగ్ పేరుతో భారీ మోసం.. నెలకు రూ.400 సబ్స్క్రిప్షన్ తో భారీ దోపిడి!

చీరకట్టులో అదిరిపోయిన వాణి భోజన్.. ఈ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే!

రెండు కాలర్లు ఎగిరేసేలా ‘డ్రాగన్ ‘ … హైప్ పెంచేస్తున్న రాజీవ్ కనకాల !

ఇన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన రాజీవ్ కనకాల!

వయసు పెరుగుతున్నా చెక్కుచెదరని అందం.. లేడీ సూపర్‌స్టార్ క్రేజే వేరు!

రాజమౌళి మహాభారతం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? రాజీవ్ కనకాల మాటలు వైరల్!

Big Stories

Advertisement
×