E-Paper
Advertisement

ఇన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన రాజీవ్ కనకాల!

ఇన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన రాజీవ్ కనకాల!
Advertisement

Rajeev Kanakala:రాజీవ్ కనకాల ..ఎన్నో సినిమాల్లో తనవైన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్ ఆకట్టుకున్న ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు. తన కెరీర్, మెగాస్టార్ చిరంజీవితో అనుభవం, ఇండస్ట్రీలో అవకాశాలు మరియు చిరంజీవి వర్కింగ్ స్టైల్ గురించి తన అనుభవాలని,అభిప్రాయాలని ఇలా బయటపెట్టారు.

ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్నప్పటికీ, తాను ఇప్పటివరకు పూర్తిస్థాయి పౌరాణిక పాత్రలు చేయలేదని ఆయన చెప్పారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో ఇంద్రుడి పాత్రలో కనిపించిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు నటుడిగా తనలోని టాలెంట్ ని బయటికి తీసే పౌరాణిక పాత్రలు చేయాలని ఉందనే కోరికను బయట పెట్టారు.తనలో ఉన్న అసలైన నటుడిని దర్శకులు ఇంకా పూర్తిగా వాడుకోలేదని, విశ్వంభర సినిమా తనకు నటుడిగా ప్రత్యేక సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.

Advertisement

ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లయినా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడానికి ఏకంగా 40 ఏళ్లు పట్టడం నిజంగా నమ్మశక్యంగా లేదని వాపోయారు.. ఇంతకాలం ఎందుకు అవకాశం రాలేదో తనకు కూడా సరిగ్గా తెలియదని చెప్పారు. అయితే ఇండస్ట్రీలో కేవలం ప్రతిభ ఒక్కటే ఉంటే సరిపోదని, మన గురించి మనం చెప్పుకోవడం, సరైన పీఆర్ ఉండటం చాలా ముఖ్యమని ఇప్పుడు తెలుసుకున్నానని వివరించారు.

ఇక సరైనోడు సినిమా సమయంలో అల్లు అర్జున్‌తో ఒకే ఫ్రేమ్‌లో ఎంతమంది ఉన్నా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ వైపే దృష్టి వెళ్తుందని మెచ్చుకోగా, అవకాశాలు వస్తే ఎన్ని సినిమాలైనా చేస్తానని బన్నీ చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.అందుకే కొత్తగా వచ్చే నటీనటులు తమకు టాలెంట్ ఉందని ఊరికే కూర్చోకుండా, అవకాశాల కోసం దర్శకులు, నిర్మాతలను కలవడంలో ఎలాంటి తప్పు లేదని సలహా ఇచ్చారు.

Advertisement

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా పోస్ట్ పోన్ కావడంపై రియాక్ట్ అవుతూ దానికి ప్రధాన కారణం పర్ఫెక్షన్ అని చెప్పారు. ఇది విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో కూడిన భారీ బడ్జెట్ సినిమా కావడంతో క్వాలిటీ విషయంలో మూవీ టీమ్ ఎక్కడా రాజీపడటం లేదని వివరించారు. చిరంజీవి సినిమా పట్ల చూపించే డెడికేషన్ గురించి చెబుతూ, గతంలో అంజి సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళు జరిగినా కంటిన్యూటీ కోసం ఒకే షర్ట్‌ను సంవత్సరాల పాటు భద్రపరిచి వాడారనే విషయాన్ని గుర్తు చేశారు.

వయసు పెరుగుతున్నా చిరంజీవి ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామాలు, ఆయన పడే శ్రమ చూస్తే తనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుందని, ఆయనను చూసి తాము కూడా మరింత ఫిట్‌గా ఉండాలని అనిపిస్తుందని నవ్వుతూ చెప్పుకొచ్చారు. నటుడిగా టాలెంట్ తో పాటు రోజూ కష్టపడే తత్వమే చిరంజీవిని ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆకాశానికి ఎత్తేశారు రాజీవ్ కనకాల !

ALSO READ :రాజమౌళి మహాభారతం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? రాజీవ్ కనకాల మాటలు వైరల్!

Tags

Related News

వరుణ్ తేజ్ కోసం లావణ్య స్పెషల్ పూజలు.. కర్వా చౌత్ ఫొటోలు చూశారా?

రితికా సింగ్ పేరుతో భారీ మోసం.. నెలకు రూ.400 సబ్స్క్రిప్షన్ తో భారీ దోపిడి!

చీరకట్టులో అదిరిపోయిన వాణి భోజన్.. ఈ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే!

రెండు కాలర్లు ఎగిరేసేలా ‘డ్రాగన్ ‘ … హైప్ పెంచేస్తున్న రాజీవ్ కనకాల !

వయసు పెరుగుతున్నా చెక్కుచెదరని అందం.. లేడీ సూపర్‌స్టార్ క్రేజే వేరు!

రాజమౌళి మహాభారతం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? రాజీవ్ కనకాల మాటలు వైరల్!

దేవి శ్రీ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్..

Big Stories

Advertisement
×