Vani Bhojan:వాణి భోజన్…టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు . ముఖ్యంగా తన టాలెంట్ తో బుల్లితెర నుంచి వెండితెర వరకు గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తెగ సందడి చేస్తుంది ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తనకు సంబంధించిన ఫొటోషూట్స్, అలాగే పర్సనల్ అప్ డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఎరుపు రంగు చీరలో కనిపిస్తున్న వాణి భోజన్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ట్రెడిషనల్ చీరకట్టులో,నుదుటిపై చిన్న ఎర్రటి బొట్టుతో కనిపిస్తున్న ఆమె లుక్ ని చూసి ఫిదా అవుతున్నారు ఫాన్స్. ముఖ్యంగా ఆమె స్మైల్ ఫోటోలకి మరింత బ్యూటీని యాడ్ చేశాయని చెప్పాలి.ఇందులో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా కనిపిస్తూనే మరోసారి అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
సాధారణంగా హీరోయిన్లు గ్లామరస్ ఫొటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారన్న సంగతి తెల్సిందే. కానీ వాణి భోజన్ మాత్రం సంప్రదాయ దుస్తుల్లో కనిపించినా సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపించడం ఇక్కడ విశేషం.ముఖ్యంగా చీరకట్టులో ఆమె లుక్ నెక్స్ట్ లెవెల్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారు.మొత్తంగా ఒకవైపు సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటూనే మరోవైపు తన ఫ్యాషన్
సెన్స్‌తోనూ ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది ఈ అందాల భామ .
ఇక వాణి భోజన్ కెరీర్ విషయానికి వస్తే, మొదట్లో బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తమిళంలో వచ్చిన దేవమగళ్ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ సీరియల్‌లో సంధ్య పాత్రలో కనిపించి ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైపోయింది. ఆ తర్వాత 2019లో వచ్చిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వాణి ఓ మై కడవులే సినిమాతో తమిళ ఇండస్ట్రీ లోనూ సత్తా చాటింది.
ఇక ఓ మై కడవులే సినిమాలో ఆకట్టుకున్న వాణి ఆ తర్వాత లాక్ అప్, మలేషియా టు అమ్నీషియా, రామే ఆండాళుం రావణే ఆండాళుం, మహాన్, మిరల్, లవ్, పాయుమ్ ఒళి నీ ఎనక్కు వంటి సినిమాల్లో నటించి తన సత్తా ఏంటో చూపించింది.అంతేకాదండోయ్ .. సెంగలం, తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ కనిపించి డిజిటల్ ఆడియన్స్ కీ దగ్గరైంది.మొతంగా. సినిమాల అప్‌డేట్స్‌తో పాటు ఇలాంటి ఫొటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరించనుందో చూడాలి !
ALSO READ :ఇన్ని సినిమాలు చేసినా ఆ కోరిక తీరలేదు.. మనసులో మాట చెప్పిన రాజీవ్ కనకాల!