E-Paper
Advertisement

దేవి శ్రీ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్..

దేవి శ్రీ విధ్వంసం..  100 మంది కళాకారులతో ఎల్లమ్మ టైటిల్ సాంగ్..
Advertisement

Yellamma Movie: బలగం సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు త్వరలోనే ఎల్లమ్మ (Yellamma) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా 2027 మార్చి 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే విడుదల తేదీకి సంబంధించి అధికారకంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా గడుపుతున్నారు.

వందమంది కళాకారులతో టైటిల్ సాంగ్..

ఇదిలా ఉండగా చిత్ర బృందం తాజాగా ఎల్లమ్మ సినిమా టైటిల్ సాంగ్(Yellamma Title Song) కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు. టైటిల్ సాంగ్ అంటే అన్ని సినిమాలలో ఉన్న విధంగా కాకుండా ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా స్పెషల్ గా ఈ పాటను రికార్డు చేశారని తెలుస్తోంది. ఎల్లమ్మ సినిమా టైటిల్ సాంగ్ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ప్రయోగం చేశారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతిలకు ప్రాతినిత్యం వహిస్తున్న 100 మంది జానపద కళాకారులను ఓకే చోటికి చేర్చి దేవి శ్రీ ప్రసాద్ ఎల్లమ్మ టైటిల్ సాంగ్ రికార్డు చేసినట్టు చిత్ర బృందం వెల్లడించారు.

ఎల్లమ్మ టైటిల్ సాంగ్ పూనకాలు గ్యారెంటీ..

Advertisement

ఇలా వందమంది కళాకారులతో సాగే ఈ పాట థియేటర్లలో ప్రతి ఒక్కరికి పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని చెప్పాలి . ఇలా ఈ టైటిల్ సాంగ్ తోనే దేవి శ్రీ ప్రసాద్ విధ్వంసం చూపించబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి పస్ట్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు ముందుగా నితిన్, నాని వంటి హీరోలను అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వీరంతా రిజెక్ట్ చేయడంతో దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Advertisement

ఇన్ని రోజులు సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు మొదటిసారి తెరపై హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి తన సంగీతంతో అందరినీ మెప్పించిన దేవిశ్రీ హీరోగా తన నటనతో ఎలా ఆకట్టుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఎల్లమ్మ సినిమా దాదాపు చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది మార్చి 5న విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

Related News

రాజమౌళి మహాభారతం వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? రాజీవ్ కనకాల మాటలు వైరల్!

ఆ వార్తలను నమ్మొద్దు.. కొరటాల బాలయ్య సినిమా రూమర్ల పై టీం క్లారిటీ!

మహిళలకు సపోర్టుగా నిలబడితే ఉద్యోగాలుండవ్ -రాధిక ఆప్టే

కోలీవుడ్‌ను షేక్ చేసిన జైలర్ 2.. వెయ్యి కోట్ల లెక్క తప్పిందా?

35 వేల అడుగుల ఎత్తులో కర్వా చౌత్ జరుపుకున్న నటి..వైరల్ అవుతున్న వీడియో!

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పేసిన సామ్ ఫ్రెండ్!

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

Big Stories

Advertisement
×