Ritika singh: టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో దానిని మంచి పనుల కోసం కాకుండా ఎంతోమంది దుర్వినియోగం చేస్తూ ఇతరులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. సెలబ్రిటీలకు సంబంధించి వారి ప్రమేయం లేకుండా డీప్ ఫేక్ ఫోటోలు వీడియోలతో సెలబ్రిటీలను కూడా భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎంతోమంది సెలబ్రిటీల పేరుతో ఇలాంటి నకిలీ అకౌంట్లో ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూ ఉండడంతో అభిమానులను సదరు సెలబ్రిటీలు అప్రమత్తం చేశారు.
రితిక సింగ్ సైతం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని వీడియోలు నకిలీ అకౌంట్లో గురించి ఆవేదన చెందుతూ ఒక వీడియో విడుదల చేశారు. కొంతమంది వ్యక్తులు తన పేరు మీద నకిలీ ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నెలకు 400 రూపాయలు చొప్పున సబ్స్క్రిప్షన్ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని ఈమె తెలిపారు. ఇలాంటి ఫేక్ ఐడీలను నమ్మి అభిమానులు ఎవరు మోసపోవద్దని ఈమె తెలిపారు. ఈ అకౌంట్స్ అన్ని తనవి కాదని, తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు బ్లూ టిక్ ఉంటుందని ఈమె స్పష్టం చేశారు.
తన పేరుతో ఉన్న ఇతర నకిలీ ఖాతాలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే తనకు రిపోర్ట్ చేయాలని ఈమె సూచించారు. తన అధికారక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి కాకుండా ఇతర ప్రొఫైల్లో కనిపించే వీడియోలు సబ్స్క్రిప్షన్ లింకులను నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని ఈమె తెలియజేశారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రిటీల ప్రొఫైల్ ఫోటోతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రితికా సింగ్ తన అభిమానులను ముందుగానే హెచ్చరిస్తూ ఈమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రితికా సింగ్ పేరు మీద కాకుండా ఇదివరకు ఎంతోమంది సెలబ్రెటీల ప్రొఫైల్ ఫోటోతో భారీగా మోసాలకు తెరలేపిన సంగతి తెలిసిందే.
Ritika singh clarification about the subscription in insta 😲 pic.twitter.com/U7X9V2ZM9u
— 𝕽æ𝖓𝖏𝖎𝖙𝖍𝕶ü𝖒𝖆𝖗 (@romeorkr) October 30, 2026
ఈ నేపథ్యంలోనే రితికా సింగ్ ఈ సోషల్ మీడియా మోసాల పట్ల అభిమానులను హెచ్చరిస్తూ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ఈమె తెలుగు సినిమాలలో నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ తమిళంలో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలలో నటించారు. రీతికా సింగ్ తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాలో నటించి సందడి చేశారు. లారెన్స్ శివగంగ, ఆది పినిశెట్టితో నీవెవరో వంటి సినిమాలలో ఈమె సందడి చేశారు ఎక్కువగా తమిళ మలయాళ సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
Also Read: రెండు కాలర్లు ఎగిరేసేలా ‘డ్రాగన్ ‘ … హైప్ పెంచేస్తున్న రాజీవ్ కనకాల !