E-Paper
Advertisement

అభిషేక్, వైభవ్, ఇషాన్‌లను వన్డేల్లోకి తీసుకోండి..ఆ రాక్షసులు భూకంపం సృష్టిస్తారు

అభిషేక్, వైభవ్, ఇషాన్‌లను వన్డేల్లోకి తీసుకోండి..ఆ రాక్షసులు భూకంపం సృష్టిస్తారు
Advertisement

Yuvraj Singh On Abhishek, Ishan and Vaibhav:  టీమిండియా వన్డే జట్టులోకి అభిషేక్ శర్మ (Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi), ఇషాన్ కిషన్ లను ( Ishan Kishan) తీసుకోవాలని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సూచనలు చేశాడు. టీ20ల్లో వాళ్ల దూకుడు చూస్తే, కచ్చితంగా వన్డేల్లోకి వస్తారనే తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఒకే వేళ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ లను వన్డేల్లోకి తీసుకోకపోతే టీమిండియాకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, వన్డేల్లో ఈ ముగ్గురు రాక్షసులు ఆడితే మాత్రం ప్రత్యర్థి బౌలర్ల గుండెలు అదిరిపోతాయని అన్నాడు. ప్రతీ మ్యాచ్ లోనూ భూకంపం సృష్టిస్తారంటూ వ్యాఖ్యానించాడు. కచ్చితంగా ఈ ముగ్గురిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకునే అంశంపై బీసీసీఐ పెద్దలు దృష్టి పెట్టాలని సూచనలు చేశాడు. దీంతో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అభిషేక్, వైభవ్, ఇషాన్‌ కిషన్‌లను వన్డేలు ఆడించాల్సిందే

అభిషేక్, వైభవ్, ఇషాన్‌ కిషన్‌లు వన్డేలు ఆడాల్సిందేనని యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ విషయంలో తాను మొదటి నుంచి ఒకే స్టాండ్ తో ఉన్నాను..అతన్ని వన్డే జట్టులో చూసే వరకు తాను నిద్రపోనన్నాడు. కచ్చితంగా వన్డేల్లోకి అతడు వస్తాడని అనుకుంటున్నానని, బీసీసీఐ కచ్చితంగా తీసుకుంటుందని అంచనా వేశాడు. అభిషేక్ శర్మ మొదటి నుంచి చాలా కష్టపడుతూనే ఉన్నాడని తెలిపాడు. అతడు పడ్డ కష్టమే..ఇప్పుడు అభిషేక్ శర్మను హీరోను చేసిందని వెల్లడించాడు. కష్టపడితేనే క్రెడిట్ వస్తుందని అతడు నిరూపించినట్టు పేర్కొన్నాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

అభిషేక్ తో పాటు వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఆడితే, వన్డేలు చూసే వారి సంఖ్య పెరుగుతందని చెప్పాడు. ఈ ముగ్గురు ఆడితే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుందన్నాడు. 50 ఓవర్ల మ్యాచ్ లను టీ20లలాగా ఆడతారంటూ పేర్కొన్నాడు. ప్రస్తుత టీమిండియా వన్డేలో జట్టులో అభిషేక్, వైభవ్, ఇషాన్‌ కిషన్‌ తరహాలోనే మెరుగైన ప్లేయర్లు ఉన్నారని, ఈ ముగ్గురి కోసం వాళ్లను తొలగించాలని తాను అనడం లేదంటూ వ్యాఖ్యానించాడు. కానీ అభిషేక్, వైభవ్, ఇషాన్‌ కిషన్‌ లకు అవకాశాలు వచ్చేలా బీసీసీఐ ప్రణాళికలు చేయాలని కోరాడు. ఇది ఇలా ఉండగా, టీమిండియా జట్టుకు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) చాలా ఏళ్లు సేవలు అందించాడు. టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగిన అతడు, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

గంభీర్ బుర్ర తక్కువ నిర్ణయాల వల్లే 4వ టీ20లో టీమిండియా ఓటమి..గవాస్కర్ ఫైర్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!

రాహుల్, కృనాల్ డకౌట్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

కాగితంపై రాసి పెట్టుకోండి..2027 వ‌రల్డ్ క‌ప్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ తీసుకు వ‌స్తారు

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

అభిషేక్ శర్మ వ‌న్డేలు ఆడితే, 500 ప‌రుగులు ఈజీగా కొట్టేస్తాడు

అభిషేక్ శ‌ర్మ‌ను ‘స్లాగ‌ర్’ అన్న మ‌హ్మ‌ద్ అమీర్ రెండు చెంపలు వాయిస్తాం!

Big Stories

Advertisement
×