Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకుంది నయనతార(Nayanthara). ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. తన నటనతో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నిలిచింది నయనతార. ఒకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార, తన కెరియర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి నోరు విప్పింది. అంతేకాదు ఒక బడా నిర్మాత అవకాశం కావాలి అంటే కోరిక తీర్చాలని ముఖం మీదే చెప్పాడు అంటూ ఆ బడా నిర్మాత గుట్టు విప్పింది నయనతార.
అవకాశం కావాలి అంటే ప**లోకి రమ్మన్నారు – నయనతార
ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార తాను ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. నయనతార మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చింది. అయితే అది చాలా పెద్ద ప్రాజెక్టు. అతి తక్కువ సమయంలోనే అంత పెద్ద ప్రాజెక్టులో అవకాశం లభించే సరికి ఆనందపడిపోయాను. అయితే ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత నన్ను అడిగిన ఒక విషయం విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. వెంటనే ఆఫర్ ను తిరస్కరించాను. ముఖ్యంగా ఈ సినిమాలో అవకాశం కావాలి అంటే మా కోరిక తీర్చాలి, ప**లోకి రావాలి అంటూ చాలా దారుణంగా మాట్లాడారు.
బడా నిర్మాత గుట్టు విప్పిన నయనతార
నాకు ఇలాంటి దొంగ దారులు అవసరం లేదు. అందుకే వెంటనే నో చెప్పి వచ్చేసాను అంటూ తెలిపింది నయనతార. ముఖ్యంగా ఆ నిర్మాత చాలా క్రూరుడు అని, కొత్త అమ్మాయి ఎవరైనా ఇండస్ట్రీలోకి వస్తే తనకు అనుకూలంగా మార్చుకుంటాడు అంటూ ఆ నిర్మాత గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆ నిర్మాత పేరు మాత్రం బయట పెట్టలేదు నయనతార.
నయనతార సినిమాలు..
‘మూకుత్తి అమ్మన్’ సినిమాతో లేడీ ఓరియంటెడ్ గా మంచి విజయం అందుకుంది నయనతార. ఈ సినిమాను తెలుగులో ‘అమ్మోరు తల్లి’ గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా ‘మూకుత్తి అమ్మన్ 2’ రాబోతోంది. ఈ చిత్రానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’ గా విడుదల చేయబోతున్నారు. మరొకవైపు తెలుగులో చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో వస్తున్న ‘మెగా 157’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది నయనతార. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. అటు కేరళలో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలతో నయనతార ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
నయనతార వ్యక్తిగత జీవితం..
వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది నయనతార. ముఖ్యంగా ప్రభుదేవా (Prabhudeva) తో పెళ్లి వరకు వెళ్ళింది. కానీ ఆ ప్రేమకి బ్రేకప్ చెప్పుకుంది. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vighnesh shivan)తో ఏడడుగులు వేసిన ఈమె.. సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది.
ALSO READ:Nithya Menon: ఏకంగా 4 సార్లు పెళ్లి.. వెనక్కి తగ్గడం వెనుక నిజం బయటపెట్టిన నిత్యామీనన్!