BigTV English

Lavanya -Varun Tej: పుట్టబోయే బిడ్డ కోసం అయోమయం .. మెగా హీరో తిప్పలు మామూలుగా లేవే?

Lavanya -Varun Tej: పుట్టబోయే బిడ్డ కోసం అయోమయం .. మెగా హీరో తిప్పలు మామూలుగా లేవే?

Lavanya – Varun Tej మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej)ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగబాబు(Nagababu) వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హిట్టు ఫ్లాప్ సినిమాలను పక్కనపెట్టి వచ్చిన అవకాశాలు అన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే వరుణ్ తేజ్ సినీ నటి లావణ్య త్రిపాఠిను (Lavanya Tripati) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడినప్పటికీ తమ ప్రేమ విషయాన్ని ఎంతో రహస్యంగా దాచారు.


తల్లి కాబోతున్న లావణ్య..

ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి గత రెండు సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఈమె పెళ్లయిన రెండేళ్లకే తల్లి కాబోతున్నానని శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం గర్భిణిగా(Pregnant) ఉన్న లావణ్య త్రిపాఠి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను మాత్రం ఎక్కడా షేర్ చేయలేదు.


అయోమయంలో వరుణ్ తేజ్..

అతి త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ కాబోతున్న నేపథ్యంలో పుట్టబోయే బిడ్డ కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ తనకు పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని బ్లాంకెట్స్ కొన్నారని తెలుస్తోంది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏది కొనాలో తెలియక అయోమయ పరిస్థితిలలో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను లావణ్య త్రిపాఠి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. బిడ్డ కోసం ఏ బ్లాంకెట్ కొనాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతి త్వరలోనే ఈ జంట తమ బిడ్డకు స్వాగతం పలకబోతున్న నేపథ్యంలో మెగా అభిమానులు బాబు పుట్టాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులు కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మెగా లెగిసీ. అలాగే కొనసాగాలి అంటే తప్పనిసరిగా వరుణ్ తేజ్ దంపతులకు వారసుడు పుట్టాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే వరుణ్ తేజ్ ఇటీవల మట్కా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తన 15 వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా VT 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది  త్వరలోనే ఈ సినిమా టైటిల్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: Harihara Veeramallu: హరిహర వీరమల్లు స్క్రీనింగ్ క్లోజ్.. తెలుగోళ్ల పరువు తీశారు కదరా!

Related News

Andhra King Taluka: ఆంధ్రా కింగ్ కు బర్త్ డే .. ఉపేంద్ర పోస్టర్ రిలీజ్

Allu vs Mega :పాన్ ఇండియా మెగాస్టార్ గా బన్నీ.. కథ సుఖాంతం అనుకుంటే.. మళ్లీ మొదలెట్టారే..

Fauji Movie : ‘ఫౌజీ’ లో బాలీవుడ్ బడా హీరో.. డైరెక్టర్ ప్లానింగే వేరప్పా..

Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా

RGV: వర్మపై మరో కేసు ఫైల్.. తప్పుదోవ పట్టించారంటూ?

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Big Stories

×