E-Paper
Advertisement

NBK 111Film: బాలయ్యకు విలన్ గా పవన్ డైరెక్టర్… పక్కాగా ప్లాన్ చేసిన గోపీచంద్ మలినేని!

NBK 111Film: బాలయ్యకు విలన్ గా పవన్ డైరెక్టర్… పక్కాగా ప్లాన్ చేసిన గోపీచంద్ మలినేని!
Advertisement

NBK 111Film: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ(Balakrishna) తన తదుపరి సినిమా పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం బాలయ్య NBK111 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ఫ్రేక్షకుల ముందుకు రాబోతోందని, ప్రస్తుతం హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

బాలయ్యకు విలన్ గా సముద్రఖని..

Advertisement

ఈ సినిమాలో బాలయ్య జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)సందడి చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం గోపీచంద్ ప్రముఖ నటుడు సముద్రఖని (samuthirakani)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నటుడు సముద్ర ఖని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మాట్లాడుతూ.. బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు.

కఠారి కృష్ణ పాత్రను మించి..

ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో సముద్రఖని కఠారి కృష్ణ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.కఠారి కృష్ణ పాత్రకు మించి బాలయ్య సినిమాలో తన పాత్ర ఉండబోతుందని సముద్రఖని తెలిపారు. ఇలా బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్ర గురించి స్వయంగా నటుడు సముద్రఖని స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగి పోయాయి. ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేశారు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో కొనసాగే యాక్షన్ మూవీగా రాబోతోందని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నారు. ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకుడుగా మరోసారి పనిచేయబోతున్నారు. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇది ఆరో సినిమా కావటం విశేషం. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, స్క్రిప్ట్ పనులు కాస్త ఆలస్యం అవ్వడంతో సినిమా షూటింగ్ కూడా ఆలస్యమైంది. అయితే ఈ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Also Read: AK 47Film: వెంకటేష్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్..ఆ స్పెషల్ డే విడుదల?

Related News

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×