E-Paper
Advertisement

YouTuber Vaishnavi Murder Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. చివరి మాటలు అవే, ఆ వీడియోలు చిచ్చుపెట్టాయి?

YouTuber Vaishnavi Murder Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. చివరి మాటలు అవే, ఆ వీడియోలు చిచ్చుపెట్టాయి?
Advertisement

YouTuber Vaishnavi Murder Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కొత్త కొత్త వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. ఆ వీడియోల విషయంలోహరి-వైష్ణవికి మధ్య గొడవ జరిగాయి. అవి తీవ్రరూపం దాల్చడంతో హత్య చేశాడు ఆమె భర్త. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలేం ఆ వీడియోల వెనుక ఏం జరిగింది? పంచాయితీ వరకు ఎందుకెళ్లింది?

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు కొత్త విషయాలు

Advertisement

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు ఎందుకు భార్యని చంపాల్సి వచ్చింది? వీరి వివాహానికి  తల్లిదండ్రులు నో చెప్పినా, ఇంటి నుంచి బయటకు వచ్చి మరీ వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. హరిబాబు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.

‘వైష్ణవి అమ్మ’ పేరుతో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఈ ఛానల్కు 48 వేలకు పైగానే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వైష్ణవి-హరి పెళ్లి వేడుకలు, ఆ తర్వాత హోమ్ టూర్, ప్రెగ్నెన్సీ ఇలా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా వీడియోలు అందులో పోస్ట్ చేశారు. షార్ట్స్ కు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

Advertisement

వైష్ణవి చివరి మాటలు.. ఆ వీడియోలు చిచ్చుపెట్టాయి?

హరికి మరొకరితో ఎఫైర్ ఉందంటూ ఇంట్లో పంచాయతీ పెట్టినట్లు వీడియో క్రియేట్ చేశారు దంపతులు. ఈ వీడియోల విషయంలో హరికి-వైష్ణవికి గొడవ జరిగినట్లు సమాచారం. ఇకపై వీడియోలు చేయొద్దని వైష్ణవిని గట్టిగా హెచ్చరించాడు హరిబాబు. ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తమకు తెలియదని అంటున్నారు కుటుంబసభ్యులు.

ఇదే సమయంలో వైష్ణవి హత్యకు చివరి వీడియో బయటకు వచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, రెండు రోజుల నుంచి జ్వరం, జలుబు ఉందని పేర్కొంది. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయని, నా తర్వాత వీడియోలో అన్నీ షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో కొంచెం అర్థం చేసుకోవాలని ఫాలోవర్స్‌ని కోరింది. తనకు వీడియోలపై ఆసక్తి లేదని, అలాగే ఎడిటింగ్ మీద కూడా లేదని తెలిపింది.

ALSO READ: తోటి విద్యార్థుల వేధింపులకు పీజీ విద్యార్థిని సూసైడ్

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×