Sathyaraj Vs Pawan Kalyan: మురుగన్ మానాడు మహాసభలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కుల, మతాలను ప్రస్తావిస్తూ కామెంట్లు చేశారో.. ఇక అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు మంత్రులు పవన్ కళ్యాణ్ మాట తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. దీనికి తోడు ప్రముఖ నటుడు, సత్యరాజ్ (Sathyaraj ) కూడా స్ట్రాంగ్ కౌంటర్ వేస్తూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఒక అవార్డు వేడుకలో ఆయన చేసిన కామెంట్లకు సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా అభిమానులు నిలిచారు అని చెప్పవచ్చు. ఈ మేరకు తాజాగా ఒక ట్విట్టర్ పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సత్యరాజ్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన అభిమాని..
అసలు విషయంలోకి వెళ్తే.. ఒక అభిమాని సత్యరాజ్ చేసిన కామెంట్లకు ధీటుగా.. “అమ్మాయిని దత్తత తీసుకొని.. తిరిగి అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఇదేనా సిద్ధాంతం అంటే” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మొత్తానికైతే సదరు అభిమాని చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటు – నెటిజన్స్..
వాస్తవానికి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై ఎవరైనా కామెంట్లు చేస్తే మిగతా హీరోలు అందరూ ఏకధాటిపై నిలబడి, వారికి అండగా నిలుస్తారు. కానీ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సత్యరాజ్ డైరెక్ట్ గా కామెంట్లు చేసినా.. ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా సొంత ఇండస్ట్రీ వ్యక్తిపై పక్క రాష్ట్రం నటుడు కౌంటర్లు వేసినా పట్టించుకోని వైనం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ కి అండగా మేమున్నామంటూ అభిమానులు ముందడుగు వేసి ఇలా సత్యరాజ్ కి కౌంటర్లు ఇవ్వడం చూసి.. నెటిజన్స్ “ఇండస్ట్రీకి ఇది సిగ్గుచేటు” అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలు దీనిపై స్పందిస్తారేమో చూడాలి.
మానాడు సభలో కుల, మత ప్రస్తావన తెచ్చిన పవన్ కళ్యాణ్..
తమిళనాడులో జరిగిన మురుగన్ మానాడు మహాసభకు హాజరైన పవన్ కళ్యాణ్.. నాస్తికులు, సెక్యులరిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు.” నాస్తికులకు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే.. నాస్తికులు హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
Also read: Hero Nani : కోలీవుడ్ మెట్లు ఎక్కుతున్న నాని… హిట్ రుణం తీర్చుకోవాలి కదా మరి!
పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన సత్యరాజ్..
ఇక ఈ వ్యాఖ్యల తర్వాత సత్యరాజు వీసీకే అవార్డు కార్యక్రమంలో పాల్గొని..” దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం. మురుగన్ మానాడు పేరుతో పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన మమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ముఖ్యంగా మురుగన్ మానాడు పేరుతో మమ్మల్ని మోసం చేశారనుకుంటే అది మీ తెలివి తక్కువతనం అవుతుంది. తమిళ ప్రజలు తెలివైన వారు. తమిళనాట మీ ఆటలు సాగవు” అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు సత్యరాజ్. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో.. ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క హీరో స్పందించకపోవడంతో అభిమానులు రంగంలోకి దిగారు.
Ammai ni adopt chesukoni thirigi ah ammai ne pelli chesukovadam ఇదేనా సిద్ధాంతాలు 😇 https://t.co/wiU4pWIMjw
— Reigning SSMB ☠️ (@Reddyboi2112) June 25, 2025