BigTV English

Hero Nani : కోలీవుడ్ మెట్లు ఎక్కుతున్న నాని… హిట్ రుణం తీర్చుకోవాలి కదా మరి!

Hero Nani : కోలీవుడ్ మెట్లు ఎక్కుతున్న నాని… హిట్ రుణం తీర్చుకోవాలి కదా మరి!

Hero Nani : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నేడు స్టార్ హీరోగా నిలదొక్కుకున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). లవర్ బాయ్ గా అమ్మాయిలను ఆకట్టుకోవడమే కాదు మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో ఇటు కుర్రాళ్లను కూడా తన అభిమానులుగా మార్చుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలకి కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయారు నాని. ఒకవైపు హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే.. ఇంకొక వైపు నిర్మాతగా మారి కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అంతేకాదు ఆ చిన్న కథలతో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు నాని. అయితే ఇప్పుడు రుణం తీర్చుకోవడానికి కోలీవుడ్ మెట్లు ఎక్కుతున్నారు నాని. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నాని కోసం కార్తీ గెస్ట్ రోల్..

ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh kolanu) దర్శకత్వంలో ‘హిట్’ సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీ పరంపరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. హిట్ సినిమాలో విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా నటించగా..’హిట్ 2′ లో అడవి శేష్ (Adivi shesh) హీరోగా నటించారు. ఇటు ‘హిట్ 3’ లో నాని ప్రభంజనం సృష్టించారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karti) స్పెషల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అంతే కాదు హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రాబోయే ‘హిట్ 4’ లో కార్తీ హీరోగా నటిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో నాని కోసం కార్తీ రంగంలోకి దిగగా.. ఇప్పుడు కార్తీ కోసం నాని రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


కార్తీ 29వ మూవీ నుండి క్రేజీ అప్డేట్..

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కార్తి ప్రస్తుతం తన 29వ మూవీగా తమిజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో తమిజ్ ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaran) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో ఇప్పుడు కార్తీ29 మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జూలై నుంచి ఈ సినిమా సెట్ పైకి వెళ్ళనుంది. 1960 బ్యాక్ డ్రాప్ లో రామేశ్వరం తీరం నేపథ్యంలో స్మగ్లింగ్ ప్లాట్ నుంచి స్ఫూర్తి పొందిన పిరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నివిన్ పౌలీ, జయరాం ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది.

హిట్ రుణం తీర్చుకోబోతున్న నాని..

కార్తీ 29 సినిమాలో నాని ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం .అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది .నాని ఈ ఏడాది నటించిన హిట్ 3 సినిమాలో కార్తీ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నాని కూడా కార్తీ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించనున్నారని.. అందుకే కోలీవుడ్ మెట్లు ఎక్కి రుణం తీర్చుకోబోతున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం కార్తీ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఖైదీ 2 సినిమా చేస్తున్నారు. మరొకవైపు సర్దార్ 2 సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

ALSO READ:Maargan: సినిమా చరిత్రలో తొలిసారి.. విడుదలకు ముందే 6 నిమిషాల సినిమా రిలీజ్!

Related News

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Coolie : కూలీ మూవీ రిలీజ్.. ఆ దేశంలో ఏకంగా ఉద్యోగులకు లీవ్.. టిక్కెట్లు కూడా ఫ్రీ!

Varsha Bollamma :సీనియర్ నటుడిని కాలుతో తన్నిన హీరోయిన్, అంత గొడవ ఏమి జరిగింది?

Coolie: తెలుగు రాష్ట్రాల్లో రజనీ ర్యాంపేజ్, ఇదయ్యా మీ అసలు స్టామినా

Rajinikanth: బట్టతలా? మరి నీది ఏంటి.. ఇలా బాడీ షేమ్ చేస్తున్నావ్.. నువ్వొక సూపర్ స్టార్‌‌వా?

Coolie: కూలీ కు అనుకూలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కారణం అదేనా?

Big Stories

×